Breaking News

ఛార్జీల పెంపు విరమించుకోవాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు సమ్మె పేరుతో 30 మంది ప్రాణాలు తీసిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై కిలోమీటరుకు 15 పైసల నుండి 20 పైసల వరకు ఆర్టీసీ కార్మికుల వేతనాలు సంస్థ కోసం ఉపయోగిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ జిల్లా నాయకులు రాజలింగం తెలిపారు.

మంగళశారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పక్కనే ఉన్న తమిళనాడు ప్రభుత్వం 2014 లో ఉన్న డీజిల్‌ రేట్లు ఇప్పటి వరకు అమలు చేస్తూ సబ్సిడీలను భరిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీజిల్‌ రేట్లపై వచ్చే పనులు 750 కోట్లు ఆర్టీసీ రేట్ల పెంపు చార్జీల పేరుతో 750 కోట్లు ప్రజల రక్తం పీల్చి ఆర్టీసీ కార్మికులకు చిల్లర విధిల్చినట్లు చర్యలు తీసుకోవడాన్ని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ కామారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.

ఇందుకోసం ప్రభుత్వం ప్రజలపై భారాలను ఆలోచన విరమించుకుని డీజిల్‌ పన్నుల రూపంలో వసూలు చేస్తున్న సొమ్ము నుంచి ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల కోసం వినియోగించాలని ప్రజలపై భారం పడకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో ప్రజా వ్యతిరేకత మరింత పెరుగుతుందని ప్రజలపై భారాలకు అడ్డుకట్ట వేసేందుకు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నాయకులు చిట్యాల తిరుపతి ఏలూరు రామచంద్రన్‌ పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *