Breaking News

దివ్యాంగులకు ఆటల పోటీలు

నందిపేట్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నందిపేట్‌ భవిత కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ వివిధ ఆటల పోటీలు నిర్వహించి, అందరికి బహుమతులు ప్రదానం చేశారు.

పిల్లలు, వారి తల్లిదండ్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షులు వాకిటి సంతోష్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు దేవేందర్‌, తహసీల్దార్‌ అలివేలు, మండల అభివద్ధి అధికారి నాగవర్ధన్‌, మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్‌ రెడ్డి, మండల భవిత కేంద్ర రిసోర్స్‌ పర్సన్స్‌ నగేష్‌ గౌడ్‌, సంతోష్‌ కుమార్‌, యం.ఆర్‌.సి సిబ్బంది, దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Check Also

మాస్కులు, శానిటీజర్లు అందజేసిన జనవిజ్ఞాన వేదిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ వారు 1000 ...

Comment on the article