Breaking News

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి. ఆదిరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జనహితలో సివిల్‌ సప్లై అధికారులు, సహకార కొనుగోలు కేంద్రాల సిఓలు, ఐకేపీ ఇన్‌చార్జిలు, ట్రాన్స్‌ పోర్టు కాంట్రాక్టర్లు, రైస్‌ మిల్లర్లతో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 38 వేల మంది రైతుల నుండి 380 కోట్ల రూపాయల విలువ గల రెండు లక్షల 7వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఇందుకు గాను 270 కోట్ల రూపాయల విలువగల 1,50,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఆన్‌లైన్‌ చేయడం జరిగిందన్నారు.

దీనికి సంబంధించి 225 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇంకెంత ధాన్యం రావచ్చనే విషయాన్ని సమీక్షించారు. కార్యక్రమంలో డిఎం, సివిల్‌ సప్లై జితేంద్ర ప్రసాద్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ ఆఫీస్‌ సమీపంలో తెలంగాణ ...

Comment on the article