Breaking News

శ్రీకాంతాచారి త్యాగం వృధా కాదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి విద్యార్థి విభాగం (టిజెఎస్‌ఎఫ్‌) నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం కన్వీనర్‌ అవుసుల రామ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ తొలి అమరవీరుడు శ్రీకాంతచారి 10వ వర్ధంతిని మంగళవారం ధర్పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. తన దేహం మంటల్లో కాలి బూడిదవుతున్న చివరి వరకు తెలంగాణ నినాదం వీడని గొప్ప త్యాగశీలి శ్రీకాంతాచారి అని కొనియాడారు.

శ్రీకాంతాచారి త్యాగం వధా కాలేదని, అయన కలలు కన్న బంగారు తెలంగాణ రూపు దిద్దుకుంటుందని అన్నారు. తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది తెలంగాణ ఉద్యమ అమరవీరులను స్మరించుకుంటామన్నారు. కార్యక్రమంలో జాగతి విద్యార్థి నాయకులు సర్వేశ్‌, దినాకర్‌, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, సురేష్‌, రఘు, కిరణ్‌, సురేష్‌, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాస్థాయి గణిత పోటీలలో రెంజల్‌ విద్యార్థులు

రెంజల్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 47వ జవహర్‌ లాల్‌ నెహ్రూ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *