Breaking News

కళాశాలలో పాముల బెడద

నందిపేట్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలకేంద్రంలోని మాడల్‌ కళాశాలలో విషసర్పాలు సంచరిసున్నాయి. మంగళవారం కూడా తరగతి గదిలో పెద్ద పాము కనబడటంతో భయబ్రాంతులకు గురైన విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

ఉపాధ్యాయులకు చెప్పడంతో స్థానికంగా సరదా కొరకు పాములను పట్టే సర్వర్‌ను పిలిచి సర్పాన్ని పట్టించారు. కానీ పిల్లలు మాత్రం భయబ్రాంతులకు గురవుతున్నారు. సకాలంలో పిల్లలు సర్పాన్ని పసిగట్టి ఉండకపోతే జరగరాని అనర్థం జరిగేది.

ఇప్పటికైన ఉపాధ్యాయులు, అధికారులు స్పందించి పాములు లోనికి ప్రవేశించకుండా తగుచర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Check Also

మాస్కులు, శానిటీజర్లు అందజేసిన జనవిజ్ఞాన వేదిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ వారు 1000 ...

Comment on the article