కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణంలోని స్థానిక నిజాంసాగర్ చౌరస్తాలో గల గిరిజన బాలుర పాఠశాలను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న హాస్టల్ బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్ర కార్యదర్శి బాలు ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. సన్నబియ్యం పేరుతో విద్యార్థులకు నాసిరకం బియ్యం అందజేయడం జరుగుతుందని, దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యంగా విద్యార్థులకు అందజేస్తున్నారన్నారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేక పోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ...
Read More »Daily Archives: December 4, 2019
7న వార్షికోత్సవ సభ
కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రవక్త ఇచ్చిన శాంతి సందేశాలు, సమాజంలో ఉండటానికి అయన చూపిన మార్గంలో ఎలా నడవాలి అనే అంశాలపై కామారెడ్డి జిల్లాలో ఈనెల 7వ తేదీ శనివారం సా 7 గంటలకు మౌలానా ముఫ్తి గాయసోద్దీన్, రహేమని ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా మౌలానా పి.ఎం ముజమ్మిల్ సహాబ్ రషాది బెంగుళూరు విచ్చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మస్జిద్ నుర్ ఇంద్ర నగర్ కాలనీలో జరిగే వార్షికోత్సవ సభకు హాజరు కావాలని జమియత్ ఉల్మా ఎ హింద్ ...
Read More »యువకుని రక్తదానం
కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన తలమడ్ల గ్రామానికి చెందిన వడ్ల శంఖరయ్యకు బి పాజిటివ్ రక్తం అవసరమవడంతో ఏబివిపి రక్తదాతల సమూహాన్ని సంప్రదించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సదాశివ్ నగర్లో రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీరామ్ స్పందించి రక్తదానం చేశారు. వారికి దన్యవాదాలు తెలిపారు.
Read More »భవన నిర్మాణ కార్మికుల పనుల కోసం ఆందోళన
కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఐక్య బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. సమావేశానికి హాజరైన జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ప్రభాకర్, ఏఐసీటీయు జిల్లా బాధ్యులు రాజలింగం మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో స్థానిక నిర్మాణ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వకుండా కాంట్రాక్టర్లు ఇంజనీర్లు బిల్డర్లు వలస నిర్మాణ కార్మికులకు అతి తక్కువ వేతనాలకు పనులు కల్పించడం వల్ల స్థానిక కార్మికులు రోడ్డున పడుతున్నారని అందుకోసం దీన్ని గుర్తించి కామారెడ్డిలోని ఇంజనీర్లు కాంట్రాక్టర్లు, ...
Read More »అంతర్జాతీయ చెస్ ఛాంపియన్‌కు ఎంపికైన విద్యార్థి
రెంజల్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవలే అంతర్జాతీయ చెస్ క్రీడకు ఎంపికైన మండల వాసి శ్రీశ్వాన్‌కు ముదిరాజ్ సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు మాట్లాడుతూ పట్టుదలతో కష్టపడి జాతీయ స్థాయిలో చెస్ ఆడటంతో పాటు భవిష్యత్‌లో మంచి క్రీడాకారునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నారు. నేటి సమాజంలో చెస్ అంటే తెలియని వారులేరని మంచిప్రతిభ కనబరుస్తూ ఆటలో రాణించి తల్లిదండ్రులపేరు దేశం పేరు నిలబెట్టాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ముదిరాజ్ సంఘం మండల ...
Read More »డయల్ 100ను నిర్భయంగా ఉపయోగించుకోవాలి
నందిపేట్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నందిపేట్ మండలకేంద్రంలోని మోడల్ కళాశాలలో ఆడపిల్లకు తమ ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి, అత్యవసర సమయంలో పోలీసులను ఎలా ఆశ్రయించాలో డయల్ 100 ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఇందులో స్థానిక ఎస్ఐ రాఘవేందర్ మాట్లాడుతూ పిల్లలు ఆపద సమయాల్లో తమను తాము ఎలా కాపాడుకోవాలి అనేదానిపై అవగాహన కల్పించారు. వాళ్ళు ఆపద ఉందని గ్రహించినా లేదా గుర్తుతెలియని వ్యక్తులు వారికి ఇబ్బంది పెడుతున్నా వెంటనే డయల్ 100 కు ...
Read More »రజక ఐక్యవేదిక యువజన అధ్యక్షుడుగా శ్రావణ్
ఆర్మూర్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రజక ఐక్య వేదిక పట్టణ కమిటి అధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జిల్లా యువజన కమిటి అద్యక్షునికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ అశన్నగారి రాజెశ్వర్ రెడ్డీ విచ్చేశారు. యువజన కమిటి జిల్లా అద్యక్షుడు మీర శ్రావణ్‌ను శాలువ తో సన్మానించి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రజకులకు ప్రభుత్వ మద్దతు ఎల్లవేళలా ఉంటుందన్నారు. అలాగే రజక విద్యార్దుల మరియు యువతకు సంబందించిన ...
Read More »అవినీతి రహిత సమాజం అందరి బాధ్యత
నిజామాబాద్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకొనటానికి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఈనెల 3 నుండి 9 వరకు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్ క్రీడా మైదానం నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్లో అవినీతి జరగకుండా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు కావాల్సిన సేవలను ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా ...
Read More »రాష్ట్ర సదస్సు గోడప్రతుల ఆవిష్కరణ
నిజామాబాద్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జార్జిరెడ్డి సమకాలీన పరిస్థితులు అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు పిడిఎస్యు నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సదస్సుకు సంబంధించిన గోడప్రతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6వ తేదీ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ హాల్లో సదస్సు ఉంటుందన్నారు. సదస్సుకు పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తారన్నారు. అలాగే వక్తలుగా ఐఎఫ్టియు అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్, న్యూడెమోక్రసి రాష్ట్ర సహాయ ...
Read More »మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయండి
రెంజల్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి కుటుంబానికి తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మిషన్ భగీరథ ఎస్సి రాజేంద్ర కుమార్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబానికి తాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన మిషన్ భగీరథ పథకాన్నీ అలసత్వం లేకుండా పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ ప్రమోద్‌కు సూచించారు. కాంట్రాక్టర్లు పనులలో అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పనులను ...
Read More »ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డిలో పర్యటన వివరాలు..
కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం 5వ తేదీ ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ కామారెడ్డి పర్యటన వివరాలు… ఉదయం 11 గంటలకు అశోక్ నగర్ కాలనీ తీజ్ మండలి దగ్గర పార్క్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జివిఎస్ కాలేజీ సమీపంలో మున్సిపల్ ఖాళీ స్థలానికి ప్రహరీగోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అశోక్ నగన్లోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ దగ్గర కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. గిరిజన ...
Read More »వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా నైపుణ్యం తెలిసి వస్తుంది
నిజామాబాద్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజ్ఞాన ప్రదర్శన విద్యార్ధుల్లోని సజనాత్మకత బయటకు వస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు అన్నారు. 47వ జవహర్లాల్ నెహ్రు జిల్లాస్థాయి సైన్స్ గణిత పర్యావరణ పరిరక్షణ – 2019 మూడు రోజులపాటు నిర్వహించడానికి స్థానిక ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో కార్యక్రమాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, శాసనమండలి సభ్యులు వి.జి.గౌడ్, ఆకుల లలితతో కలిసి ఆయన జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ...
Read More »చదువుతో పాటు క్రీడలు అత్యవసరం
రెంజల్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అత్యవసరమని మండల ప్రజాపరిషత్ సభ్యురాలు లోలపు రజినీ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఎంపీపీ రజినీ, జడ్పీటీసీ సభ్యురాలు విజయ జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయని క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించి ...
Read More »