డయల్‌ 100ను నిర్భయంగా ఉపయోగించుకోవాలి

నందిపేట్‌, డిసెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నందిపేట్‌ మండలకేంద్రంలోని మోడల్‌ కళాశాలలో ఆడపిల్లకు తమ ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి, అత్యవసర సమయంలో పోలీసులను ఎలా ఆశ్రయించాలో డయల్‌ 100 ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలపై అవగాహన కల్పించారు.

ఇందులో స్థానిక ఎస్‌ఐ రాఘవేందర్‌ మాట్లాడుతూ పిల్లలు ఆపద సమయాల్లో తమను తాము ఎలా కాపాడుకోవాలి అనేదానిపై అవగాహన కల్పించారు. వాళ్ళు ఆపద ఉందని గ్రహించినా లేదా గుర్తుతెలియని వ్యక్తులు వారికి ఇబ్బంది పెడుతున్నా వెంటనే డయల్‌ 100 కు సమాచారం అందచేస్తే వెంటనే వారి ఫోన్‌ను ట్రేస్‌ చేసి వాళ్లకు రక్షణ కలిపిస్తామని అన్నారు.

ఎలాంటి భయబ్రాంతులకు లోను కాకుండా నిర్భయంగా 100 ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫిరోజ్‌ హైదర్‌, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయాలి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ప్లాన్‌ యాక్షన్‌ తయారు ...

Comment on the article