విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

ఆర్మూర్‌, డిసెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన సెయింట్‌ పల్స్‌ పాఠశాలలో భీమ్‌గల్‌ మండలం పిప్రి గ్రామానికి చెందిన పెంట సంజయ్‌ 9వ తరగతి చదువుతున్నాడు.

అయితే తరగతి గదిలో స్కూల్‌ వర్క్‌లో ‘ఆకలి’ అనే అక్షరానికి బదులు ‘అకలి’ అని రాయడంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ తనయుడు ఆణ్ణోపాల్‌ అలియాస్‌ బబ్లు విద్యార్థినిని వీపుపై కర్రతో విపరీతంగా చితకబాదాడు. విషయం తెలుసుకున్న తల్లి విజయ ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఆర్మూర్‌ ఎస్‌ఐ విజయ్‌ నారాయణ తెలిపారు.

Check Also

అవార్డు కొరకు దరఖాస్తుల‌ ఆహ్వానం

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌ పాఠశాల‌ల్లో ...

Comment on the article