Breaking News

100, 112 నెంబర్ల పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్ఛంద సంస్థ ముద్రించిన అత్యవసర సహాయ నంబర్ల పోస్టర్లను శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కమిషనరేట్‌లో అదనపు పోలీస్‌ కమీషనర్‌ ఉషా విశ్వనాథ్‌ ఆవిష్కరించారు. 100, 112 నంబర్లతో కూడిన పోస్టర్లు ముద్రించడం వంటి అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని ఈ సందర్భంగా డిసిపి అన్నారు.

వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ ముద్రించిన పోస్టర్లను కళాశాలలు తదితర జనసమర్ద ప్రాంతాలలో అతికించడం ద్వారా అత్యవసర నంబర్ల విషయాన్ని విసతంగా ప్రచారం చేస్తామని వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం జాతీయ సమన్వయ కర్త తిరునగరి శ్రీహరి చెప్పారు.

కార్యక్రమంలో సంస్థ జిల్లా సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లు, మహిళా ప్రతినిధులు తిరునగరి ప్రసన్న, జిల్కర్‌ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

లక్కీ లాటరీ నడుపుతున్న ఇద్దరిపై కేసు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ ...

Comment on the article