Breaking News

Daily Archives: December 7, 2019

గిరిజనుల పథకాలపై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాలు గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలు వారికి చేరేలా అధికారులు అవగాహన కల్పించాలని జాతీయ గిరిజన కమిషన్‌ సభ్యురాలు మాయ చింతామణ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం సంబంధిత అధికారులతో ఆమె జిల్లాకు చేరుకుని ప్రగతిభవన్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వాలు గిరిజనులకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకాలు చేర్చడానికి వారికి అవసరమైన అవగాహన కల్పించడం వారికోసం ఏ రకమైన కార్యక్రమాలు ...

Read More »

జిల్లా స్థాయి గణిత పరీక్షకు 400 మంది ఎంపిక

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సుమారుగా 2450 మంది విద్యార్థులు హాజరైనట్టు గణిత ప్రతిభా పరీక్షల కన్వీనర్‌ యం.సాయిలు పేర్కొన్నారు. తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాడ్వాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇట్టి పరీక్షలకు అనుమతించిన జిల్లా విద్యశాఖాధికారికి కతజ్ఞతలు మరియు పరీక్ష నిర్వహణకు సహకరించిన మండల విద్యశాఖాధికారికి, ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు, అన్ని మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు ...

Read More »

మహిళా చట్టాలు, రక్షణపై అవగాహన

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ జి.వైజయంతి ఆదేశానుసారం శనివారం కామారెడ్డి సాందీపని డిగ్రీ కళాశాలలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. చట్టాల ద్వారా మహిళలకు కలిగే హక్కు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫోన్‌ నెంబర్లు, షీ టీం, సఖి టీం ఫోన్‌ నెంబర్లు, లీగల్‌ సెల్‌ ద్వారా న్యాయస్తానంలో ఉచిత ప్రయోజనాల గురించి వివరించారు. ప్రతి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని, లేకపోతే స్థానిక పోలీసులకు, లీగల్‌ సర్వీస్‌కు తెలియపరచాలని ...

Read More »

ప్రతిభా పరీక్షలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో శనివారం గణిత ప్రతిభ పరీక్ష నిర్వహించారు. మండల స్థాయి పరీక్ష ప్రశ్నపత్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గణితానికి అన్ని విషయాల కంటే విశిష్ట స్థానముందన్నారు. ప్రతిభా పరీక్షలు రాస్తూంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. తెలంగాణ గణిత ఫోరం కామారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని అభినందించారు. తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అనుమతితో ...

Read More »

మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్ష పోటీలు

రెంజల్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్షలు నిర్వహించినట్లు గణిత ఫోరం బోధన్‌ డివిజన్‌ అధ్యక్షులు పరమేశ్వర్‌ తెలిపారు. గణితశాస్త్రం ప్రతిభ పోటీలకు మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగిందన్నారు. పరీక్షలో ప్రతిభ చూపిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులలో ప్రతి మీడియా నుండి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి ఈ నెల 14న జిల్లా కేంద్రంలో నిర్వహించే ...

Read More »

నేటితో ఏడాది పూర్తి

బాన్సువాడ, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ (డిసెంబర్‌ 07/ 2018) ఎన్నికల్లో తమ అమూల్యమైన తీర్పు ఇచ్చి నేటితో ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ఓటరు దేవుళ్ళకు, టి.ఆర్‌.ఎస్‌ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెరాస యువనాయకులు, పిఏసిఎస్‌ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి హదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఓటర్లు ఇచ్చిన అమూల్యమైన తీర్పుతో బాన్సువాడ శాసనసభ సభ్యునిగా ఎన్నికయిన పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆశీస్సులతో తెలంగాణ ...

Read More »

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మగ్గిడి గ్రామంలో వ్యవసాయ కూలిగా పని చేసుకొనే మహారాష్ట్రకు చెందిన నాగనాథ్‌ (45) శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు చెరువులో పడి మతి చెందాడు. నాగనాథ్‌ బార్య రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్‌ ఎస్‌ఐ విజయ్‌ నారాయణ తెలిపారు.

Read More »

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో తప్పిన ఘోర ప్రమాదం

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. 50 ఫీట్ల పొడవు జాతీయ జెండాను బింగించే క్రమంలో క్రేన్‌ అదుపు తప్పి రైల్వే స్టేషన్‌ బయట ఉన్న చిరు వ్యాపార సముదాయాల కోకలపై పడింది. దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న సుమారు పదిమంది వరకు పక్కకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.

Read More »

గల్ఫ్‌ బాధిత కుటుంబానికి పరామర్శ

నందిపేట్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రం పాతూర్‌లో మంగలి గంగాధర్‌ కుటుంబాన్ని గల్ఫ్‌ బాధితుల సంఘం అధ్యక్షుడు బాసంత్‌ రెడ్డి కలిశారు. గంగాధర్‌ గత ఏడు సంవత్సరాలుగా గల్ఫ్‌లో ఉండిపోయారు. అక్కడ తన పాస్‌ పోర్ట్‌ దగ్గర లేదని అది వేరే వారి చేతులో ఉందంటూ అక్కడే ఉండిపోయాడు. తన కష్టాలు చెప్పకుండా రెండు నెలలకు ఒక సారి ఫోన్‌ మాట్లాడుతున్నారని, గత వారం క్రితం గంగాధర్‌ భార్య లావణ్య, కూతురు ఆకాంక్ష, కొడుకు ఆకాష్‌లు బసంత్‌ ...

Read More »

సాయుధ దళాల సంక్షేమానికి విరాళాలు అందించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రక్షణకు పాటుపడుతున్న సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి ప్రజలు విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు కోరారు. సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి కలెక్టర్‌ ర్యాలీని ప్రారంభించారు. తనవంతుగా విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సైనికులు అన్నీ త్యాగం చేసి కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలకు దూరంగా ఉంటూ దేశ రక్షణకు పాటుపడుతున్నారన్నారు. విధుల్లో భాగంగా వారు వారి జీవితాలను ...

Read More »

కాంతి హైస్కూల్‌కు ఉత్తమ పాఠశాల అవార్డు

ఆర్మూర్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామానికి చెందిన కాంతి హైస్కూల్‌కు హైద్రాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరిగిన బ్రెయిన్‌ ఫీడ్‌ 7వ జాతీయ కాన్ఫరెన్స్‌లో జాతీయ స్థాయిలో ఉత్తమ పాఠశాల అవార్డు ఇవ్వడం జరిగిందని కాంతి గంగారెడ్డి తెలిపారు. నేషనల్‌ హ్యాండ్‌ రైటింగ్‌ అకాడమీ డైరెక్టర్‌ మల్లికార్జున్‌ రావ్‌, భ్రమ్మమ్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి హాజరయ్యారని తెలిపారు.

Read More »

పందులను నివారించ లేరా?

నందిపేట్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో ఏముంది ..ఒకవైపు అపరిశుభ్ర వాతావరణం.. మరోవైపు పందుల బెడద అంటూ ప్రజలు మాట్లాడుకొంటున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతుండడంతో గ్రామం దుర్గంధంగా మారి కంపు కొడుతోంది. ఏ వీధిలో చూసినా ఏమున్నది గర్వకారణం.. చెత్తాచెదారం- పందులు తప్ప అన్న విధంగా తయారైంది. పాలకులు, అధికారులు మేల్కొనకపోతే మున్ముందు చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు 30 రోజుల ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్‌ నెలలో నందిపేట్‌ ఆకస్మిక ...

Read More »