Breaking News

గిరిజనుల పథకాలపై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాలు గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలు వారికి చేరేలా అధికారులు అవగాహన కల్పించాలని జాతీయ గిరిజన కమిషన్‌ సభ్యురాలు మాయ చింతామణ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం సంబంధిత అధికారులతో ఆమె జిల్లాకు చేరుకుని ప్రగతిభవన్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వాలు గిరిజనులకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకాలు చేర్చడానికి వారికి అవసరమైన అవగాహన కల్పించడం వారికోసం ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వాటికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అర్హత కలిగిన పథకాలకు సంబంధించి అర్హత కలిగిన వారి చేత దరఖాస్తు చేయించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని, దరఖాస్తుల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో వారికి తెలపాలని సూచించారు.

అంతేగాక గిరిజనులకు సంబంధించిన కేసులు వీలైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా హౌసింగ్‌, రైతు బంధు, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, భూగర్భ జల శాఖ, విద్యాశాఖ, వసతి గహాలు తదితర శాఖలకు సంబంధించి గిరిజనులకు కల్పిస్తున్న సదుపాయాలపై సమీక్షించారు. గిరిజనులు పడుతున్న ఇబ్బందులపై సంఘ నాయకులు చంద్రు నాయక్‌ కమిషన్‌ దష్టికి తీసుకువచ్చారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు జిల్లాలో గిరిజన విద్యార్థులకు అందజేస్తున్న స్కాలర్‌ షిప్‌లు, నిర్వహిస్తున్న వసతి గహాలు, వాటిల్లో విద్యార్థినీ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు వివరించారు.

అదేవిధంగా గిరిజనుల పండుగల సందర్భంగా ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఆమె వెంట ప్రైవేట్‌ సెక్రటరీ సుధీర్‌, రీసెర్చ్‌ అధికారి దీపిక ఖన్నా ఉన్నారు. కార్యక్రమంలో అదనపు డిసిపి శ్రీధర్‌ రెడ్డి, డిఎఫ్‌ఓ సునీల్‌, డిటిడబ్ల్యూఓ సంధ్యా రాణి, డిసిపి శ్రీనివాస్‌ కుమార్‌, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పూచీకత్తు లేని రుణాలు అందించడానికి కృషి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమల‌కు గ్యారెంటీ ...

Comment on the article