మహిళా చట్టాలు, రక్షణపై అవగాహన

కామారెడ్డి, డిసెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ జి.వైజయంతి ఆదేశానుసారం శనివారం కామారెడ్డి సాందీపని డిగ్రీ కళాశాలలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. చట్టాల ద్వారా మహిళలకు కలిగే హక్కు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫోన్‌ నెంబర్లు, షీ టీం, సఖి టీం ఫోన్‌ నెంబర్లు, లీగల్‌ సెల్‌ ద్వారా న్యాయస్తానంలో ఉచిత ప్రయోజనాల గురించి వివరించారు.

ప్రతి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని, లేకపోతే స్థానిక పోలీసులకు, లీగల్‌ సర్వీస్‌కు తెలియపరచాలని అవగాహన కల్పించారు. స్త్రీల న్యాయం కొరకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉండి కృషి చేస్తామన్నారు.

కార్యక్రమంలో సీనియర్‌ పిపి కొమలత, సుబ్బయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో వివరించారు. కామారెడ్డి డిస్ట్రిక్‌ అడిషనల్‌ పిపి అమృతరావు, ఎపిపి కిషన్‌, ఎపిపి వీరయ్య, ఎపిపి జెట్టి రమణ, ఎం.డి. రహీమ్‌, సీనియర్‌ న్యాయవాదులు సిద్దిరాములు, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండగల వివరాలు

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *