Breaking News

నేటితో ఏడాది పూర్తి

బాన్సువాడ, డిసెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ (డిసెంబర్‌ 07/ 2018) ఎన్నికల్లో తమ అమూల్యమైన తీర్పు ఇచ్చి నేటితో ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ఓటరు దేవుళ్ళకు, టి.ఆర్‌.ఎస్‌ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెరాస యువనాయకులు, పిఏసిఎస్‌ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి హదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఓటర్లు ఇచ్చిన అమూల్యమైన తీర్పుతో బాన్సువాడ శాసనసభ సభ్యునిగా ఎన్నికయిన పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నతమైన శాసనసభ స్పీకర్‌ పదవిని అధీష్టించారన్నారు. స్పీకర్‌గా అత్యున్నత స్థానంలో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ పరిధిలో అభివద్ధి పనులను శరవేగంతో పరిగెత్తిస్తూ రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివ ద్ధిలో ఉన్నత స్థానంలో నిలిపారన్నారు.

స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిపై మీ ఆదరణ, అభిమానం, అనుబంధం ఇలాగే కొనసాగాలని, కొనసాగుతాయని ఆశిస్తూ మరొక్కసారి నియోజకవర్గ ఓటరు దేవుళ్ళకు, నియోజకవర్గ ముఖ్యనాయకులకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లకు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు, ఎంపీటీసీలకు, సర్పంచ్‌లకు, నియోజకవర్గంలోని ఇతర ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, రైతులకు, నియోజకవర్గ మహిళలకు, నియోజకవర్గ యువతకు, పత్రికా మిత్రులందరికి పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Check Also

కౌంటింగ్‌కు మొబైల్‌ ఫోన్ల అనుమతి లేదు

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బంది కానీ, ఏజెంట్లకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *