Breaking News

ప్రతిభా పరీక్షలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం

కామారెడ్డి, డిసెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో శనివారం గణిత ప్రతిభ పరీక్ష నిర్వహించారు. మండల స్థాయి పరీక్ష ప్రశ్నపత్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గణితానికి అన్ని విషయాల కంటే విశిష్ట స్థానముందన్నారు. ప్రతిభా పరీక్షలు రాస్తూంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. తెలంగాణ గణిత ఫోరం కామారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని అభినందించారు.

తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అనుమతితో రామానుజన్‌ జయంతి సందర్భంగా ప్రతిబా పరీక్షలు, గణిత సెమినార్లు, గణిత ప్రయోగశాల ఏర్పాటుకు ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నామన్నారు.

రాష్ట్రస్థాయి ప్రతిభా పరీక్షలను కరీంనగర్‌ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో తాడ్వాయి శ్రీనివాస్‌, రామారావు, శ్రీదేవి, వీరబ్రహ్మం, సుకన్య, భాస్కర్‌, భైరయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article