Breaking News

గల్ఫ్‌ బాధిత కుటుంబానికి పరామర్శ

నందిపేట్‌, డిసెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రం పాతూర్‌లో మంగలి గంగాధర్‌ కుటుంబాన్ని గల్ఫ్‌ బాధితుల సంఘం అధ్యక్షుడు బాసంత్‌ రెడ్డి కలిశారు. గంగాధర్‌ గత ఏడు సంవత్సరాలుగా గల్ఫ్‌లో ఉండిపోయారు. అక్కడ తన పాస్‌ పోర్ట్‌ దగ్గర లేదని అది వేరే వారి చేతులో ఉందంటూ అక్కడే ఉండిపోయాడు.

తన కష్టాలు చెప్పకుండా రెండు నెలలకు ఒక సారి ఫోన్‌ మాట్లాడుతున్నారని, గత వారం క్రితం గంగాధర్‌ భార్య లావణ్య, కూతురు ఆకాంక్ష, కొడుకు ఆకాష్‌లు బసంత్‌ రెడ్డిని కలిసి సమస్య వివరించారు. దీంతో శనివారం ఆయన బాధిత ఇంటికి వచ్చి పరిస్థితులు, సమస్యలు తెలుసుకున్నారు.

తమ భర్త ఒక్క రూపాయి కూడా పంపకపోవడంతో పూట గడవడం కష్టంగా ఉందని, తమ కూతురు ఫీజు కట్టలేక కాలేజ్‌ మాన్పించానని రోదిస్తూ తెలిపింది. కష్టాలు తెలుసుకున్న బసంత్‌ రెడ్డి మంగలి గంగాధర్‌ను స్వదేశానికి రప్పించేందుకు అన్నివిధాలా కషి చేస్తామని చెప్పారు.

Check Also

కౌంటింగ్‌కు మొబైల్‌ ఫోన్ల అనుమతి లేదు

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బంది కానీ, ఏజెంట్లకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *