Breaking News

మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్ష పోటీలు

రెంజల్‌, డిసెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్షలు నిర్వహించినట్లు గణిత ఫోరం బోధన్‌ డివిజన్‌ అధ్యక్షులు పరమేశ్వర్‌ తెలిపారు. గణితశాస్త్రం ప్రతిభ పోటీలకు మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగిందన్నారు.

పరీక్షలో ప్రతిభ చూపిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులలో ప్రతి మీడియా నుండి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి ఈ నెల 14న జిల్లా కేంద్రంలో నిర్వహించే గణితశాస్త్రం జిల్లా స్థాయి ప్రతిభ పోటీలలో పాల్గొంటారని చెప్పారు.

కార్యక్రమంలో పిఆర్‌టియు మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్‌, గణిత శాస్త్రం ఉపాధ్యాయులు ప్రవీణ్‌, అరుణ్‌ కుమార్‌, సాయికుమార్‌, నవీన్‌, ఖలీల్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కౌంటింగ్‌కు మొబైల్‌ ఫోన్ల అనుమతి లేదు

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బంది కానీ, ఏజెంట్లకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *