Breaking News

Daily Archives: December 9, 2019

దొంగ ఓట్లు తొలగించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని పోటీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కొందరు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఈనెల 17వ తేదీన జారీచేసే తుది జాబితా లోపు తక్షణం విచారణ చేసి దొంగ ఓట్ల తొలగింపు చర్యలు తీసుకోవాలని ఎంసిపిఐయు నాయకులు డిమాండ్‌ చేశారు. నమోదు చేసిన ఆన్‌లైన్‌ సెంటర్లపై చట్టపరమైన చర్యలకు ఎంసిపిఐయు పార్టీ డిమాండ్‌ చేస్తుందన్నారు. ఆర్‌డిఓ తక్షణం దొంగ ఓట్లు నమోదు చేస్తున్న అభ్యర్థులను ...

Read More »

నందిపేట్‌ తహసీల్దార్‌గా రవీందర్‌ నాయక్‌

నందిపేట్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల తహసిల్దార్‌గా రవీందర్‌ నాయక్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ తాసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన సోమవారం నుండి తహసిల్దార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించే తహసిల్దార్‌ అలివేలు సెలవులో ఉండడంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో బదిలీపై వచ్చిన తహసిల్దారు అందరిని తమ తమ సొంత జిల్లాలకు బదిలీ చేసినప్పటికీ నందిపేట్‌లో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్‌ను ఇప్పటివరకు బదిలీ చేయకపోవడం గమనార్హం.

Read More »

కుర్చీ క కిస్సా…

నందిపేట్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం జరిగిన గ్రామ సభ గందరగోళం మధ్య ఎలాంటి తీర్మానాలు లేకుండా ముగిసింది. సర్పంచ్‌ సాంబార్‌ వాణి అధ్యక్షతన, ఇన్చార్జ్‌ పంచాయతీ సెక్రెటరీ గంగాధర్‌ నిర్వహించిన సమావేశంలో వార్డు సభ్యులు, జెడ్పిటిసి సభ్యురాలు ఎర్రం యమునా, ముగ్గురు ఎంపిటిసిలు, ఎంపిడిఓ నాగవర్ధన్‌, గ్రామస్తులు హాజరయ్యారు. గ్రామ సమస్యలపై చర్చిస్తుండగా ఉపసర్పంచ్‌ వాసర రామచందర్‌ (12వ వార్డు) కు చెందిన గ్రామపంచాయతీ మీటింగ్‌ హాలులో గల కుర్చీని ...

Read More »

పారిశుద్ధ్య కార్మికులకు ఆత్మీయ సన్మానం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక సమరసతా వేదిక ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు ఆత్మీయ గౌరవ సన్మానం నిర్వహించారు. అంతకు ముందు పారిశుధ్య కార్మికుల సర్వే నిర్వహించి, వారి వివరాలు నమోదు చేశారు. స్థానిక సద్గురుధామంలో నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌ మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవగా భావించి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సన్మానించుకోవడం తమ భాగ్యంగా భావిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక ...

Read More »

ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు

నందిపేట్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధి జయంతిని నందిపేట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్‌ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. యువజన కాంగ్రెస్‌ ఆర్మూర్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మంద మహిపాల్‌ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన సోనియాగాంధికి తెలంగాణ ప్రజలు ఎప్పటికి రుణపడి ఉంటారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ కీలకపాత్ర పోషించినందున జయంతి వేడుకలను అధికారికంగా ...

Read More »

పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగించండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెల రోజుల పాటు గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చినందున గ్రామ మండల జిల్లా ప్రత్యేక అధికారులు పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో అధికారులతో పలు విషయాలపై కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు నిర్విరామంగా కొనసాగించడంతో పాటు మొక్కల పరిరక్షణ ప్లాస్టిక్‌ వాడకుండా ఉండటం, వీధులు శుభ్రం చేయడం తదితర ...

Read More »

అవినీతి అంతానికి కట్టుబడి ఉండాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవినీతికి తావులేకుండా పనులు చేయించుకోవడానికి ప్రజలు కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నెల 3 నుండి 9 వరకు వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమాల ముగింపు రోజున సోమవారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల్లో వస్తున్న చైతన్యం వల్ల కొంతమేరకు అవినీతి తగ్గిందని ఇది మరింత మెరుగు పడవలసిన అవసరముందన్నారు. ప్రజల్లో ...

Read More »

చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మతి

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో కష్ణ మందిరం సమీపంలో ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న లావణ్య (35), రోషిణి (14), సుశీల్‌ (28), ప్రశాంత్‌ (26) నలుగురు అక్కడికక్కడే మతి చెందారు. కారులో మతదేహాలు ఇరుక్కుపోవడంతో పోలీసులు గ్యాస్‌ కట్టర్‌తో కారు భాగాలను వేరుచేసి మతదేహాలను బయటకు తీశారు. మతుల్లో డ్రైవర్‌ ప్రశాంత్‌ నిజామాబాద్‌ ...

Read More »