కామారెడ్డి, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యు (తెలంగాణ రాష్ట్ర మహిళ సమాఖ్య) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్తెల సజన హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల నిర్లక్ష్యంగానే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో, కేంద్రంలో, మద్యం విచ్చల విడిగా ఏరులై పారుతుందన్నారు. అలాగే ఎన్కౌంటర్ శాశ్వత పరిష్కారం కాదని ఆమె అన్నారు. ఆలాగే ప్రభుత్వాలు మద్యపానం, అశ్లిల చిత్రాలు నిషేధించాలని అన్నారు. ...
Read More »Daily Archives: December 10, 2019
స్త్రీ నిధి రుణాలు సక్రమంగా మంజూరయ్యేలా చూడాలి
నిజామాబాద్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంఘాల బలోపేతానికి మహిళల ఆర్థిక అభివద్ధికి దోహదపడే స్త్రీనిధి రుణాలు లక్ష్యానికి అనుగుణంగా మంజూరు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో డీఆర్డిఎ మెప్మా అధికారులతో, సిబ్బందితో స్త్రీ నిధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీ నిధి కింద ఈ సంవత్సరం రూ.207 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.135 కోట్లు మంజూరు చేయవలసి ఉండగా కేవలం 19 ...
Read More »భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి
నిజామాబాద్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంకా పరిష్కరించవలసిన భూ సమస్యలపై ఆర్.డి.ఓ.లు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్లో ఆర్డీవోలతో ఎల్‌ఆర్‌యుపిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అనుగుణంగా ఇంకా పెండింగ్‌లో ఉన్న పాస్ బుక్కులను వెంటనే జారీ చేయటానికి చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసులు, అనర్హత కేసులు మినహా మిగతా కేసులన్నీ పరిష్కరించడానికి ప్రత్యేకంగా శ్రద్ధ కనబర్చి తహసిల్దార్లు గ్రామస్థాయి అధికారులకు తగు ఆదేశాలు ...
Read More »జడ్పీ చైర్మన్‌ని కలిసిన సర్పంచులు
రెంజల్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు వికార్ పాషా ఆధ్వర్యంలో రెంజల్ మండల సర్పంచ్‌లు మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ దాదన్నగారి విఠల్ రావ్ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్ పాషా మాట్లాడుతూ సర్పంచుల సంక్షేమం కోసం కషి చేయాలని, గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్ల కొనుగోలులో జాప్యం లేకుండా చూడాలని అన్నారు. గ్రామ పంచాయితీల అభివద్ధికి సహాయసహకారాలు అందించాలని జడ్పీ ఛైర్మన్‌ను ...
Read More »విధి నిర్వహణలో బదిలీలు సహజమే
రెంజల్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి విధినిర్వహణలో బదిలీలు సహజమేనని తహసీల్దార్ అసదుల్లా ఖాన్ అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిలు పదోన్నతిపై, బోధన్ ఆర్డిఓ ఆఫీస్‌లో ఆర్ఐగా పదోన్నతి పొందడంతో బదిలీపై వెళ్తున్న సాయిలు ను తహసీల్దార్ అసాదుల్లా ఖాన్, నాయబ్ తహసీల్దార్ గంగాసాగర్ శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగాధర్, సీనియర్ అసిస్టెంట్ స్రవంతి, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
Read More »చలో ఢిల్లీ పోస్టర్ల ఆవిష్కరణ
రెంజల్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సుంకరి మోహన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గోడప్రతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 21 వరకు చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి మాలలు మాల ఉపకులాలు అధిక సంఖ్యలో తరలివచ్చి చలో ఢిల్లీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల మాల మహనాడు నాయకులు సునీల్, భూమేష్, సుధాకర్, ...
Read More »పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌కు అభిప్రాయాలు తెలపాలి
నిజామాబాద్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు రాజకీయ పార్టీల ప్రతినిధులు అభిప్రాయాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు కోరారు. మంగళవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్లలో లోకేషన్లో మార్పు, పోలింగ్ కేంద్రాల పేర్ల మార్పు, అదనపు పోలింగ్ కేంద్రాలపై ప్రతిపాదనలు పంపించడం, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ ...
Read More »మున్సిపాలిటీలలో వాహనాలు సమకూర్చుకోవడానికి చర్యలు
నిజామాబాద్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ కార్యక్రమాల అవసరాలకు వాహనాలను సమకూర్చుకోవడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్లతో వాహనాల ఏర్పాటుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి 500 కుటుంబాలకు ఒక స్వచ్ఛ ఆటో, 400 కుటుంబాలకు ఒక ఫోర్ వీలర్, 50 వేల జనాభాకు స్వీపింగ్ మిషన్, 500 కుటుంబాలకు ఒక ...
Read More »ఉమెన్స్ ఫుట్‌బాట్ లీగ్ కార్యాలయం ప్రారంభం
నిజామాబాద్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉమెన్స్ ఫుట్‌బాట్ లీగ్ కార్యాలయాన్ని కేర్ ఫుట్‌బాల్ అకాడమీ అధ్యక్షుడు నరాల సుధాకర్ మంగళవారం ప్రారంభించారు. ఈనెల 28 నుండి జనవరి 3 వరకు జరిగే తెలంగాణ ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ కోసం కార్యాలయాన్ని స్థానిక వినాయక్ నగర్లో ఎస్ఎస్ పోర్ట్స్ అకాడమీ ప్రక్కన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మొదటిసారి తెలంగాణలో జరుప తలపెట్టిన ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగును నిజామాబాద్ ప్రజలందరూ విజయవంతం ...
Read More »ఓటు హక్కు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసమానతలు లేని సమాజం కోసం రాజ్యాంగం ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించిందని ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ అన్నారు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో మంగళవారం మద్యాహ్నం మాక్లూర్ మండలం మదన్ పల్లి జడ్పి ఉన్నత పాఠశాలలో మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి రవీందర్ ప్రధాన వక్తగా హాజరై విద్యార్తులనుద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకోవాలి గానీ దుర్వినియోగం ...
Read More »మిషన్ అంత్యోదయ పూర్తి చేయండి
రెంజల్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన మిషన్ అంత్యోదయని పూర్తి చేయాలని డిఎల్పిఓ గౌస్ అన్నారు. మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శితో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి రికార్డులో పొందుపరచి మిషన్ అంత్యోదయని పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ గౌస్, కార్యదర్శులు రఘురామ్, యాదగిరి, శ్రీనివాస్, చరణ్ తదితరులు ఉన్నారు.
Read More »పాఠశాల గుర్తింపు రద్దుచేయాలి
ఆర్మూర్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంజయ్ అనే విద్యార్థిని తీవ్రంగా కొట్టి గాయపరచడమే గాకుండా, బాదిత కుటుంబానికి అండగా ఉన్న విద్యార్థి యువజన సంఘాల నేతలను బెదిరింపులకు పాల్పడుతున్నారని పివైఎల్, ఎన్ఎస్యుఐ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. వాట్సప్ మెసేజ్‌లు పంపుతూ బెదిరింపులకు పాల్పడుతున్న సెయింట్ పాల్స్ హై స్కూల్ యజమాని బబ్లూను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్, ఎన్ఎస్యుఐ డివిజన్ అధ్యక్షుడు ...
Read More »ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
నిజామాబాద్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంతో ప్రతిష్టాత్మకమైన పెద్ద రోడ్డు అయిన ఖిల్లా-గురుద్వారా-గోల్ హనుమాన్-పులాంగ్ రోడ్డును నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త ప్రత్యేక దష్టి సారించి బిటి రోడ్డుగా వేయించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ రంగు అపర్ణ సీతారామ్ ఆధ్వర్యంలో నగరంలోని 24 వ డివిజన్ గాజులపెట్ గురుద్వారా దగ్గర ఎమ్మెల్యే చిత్రపటానికి స్థానిక ప్రజలు పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఘనత ఎమ్మెల్యే గణేష్ గుప్తదేనన్నారు. కాలనీ ...
Read More »పొగాకు దుష్ప్రభావంపై అందరికీ తెలియాలి
నిజామాబాద్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొగాకు దుష్ప్రభావంతో జరిగే నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో పొగాకు కంట్రోల్‌పై జిల్లాస్థాయి సమన్వయ సమితి సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు ప్రభావం వల్ల ప్రతి సంవత్సరం దేశంలో 13.5 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. పొగాకు ప్రభావం పొగ తాగే వారికి కాకుండా ఇతరులకు కూడా నష్టం ...
Read More »పేద రైతులకు కొత్త పాసుపుస్తకాలివ్వాలి
కామారెడ్డి, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామంలోని పేద రైతులకు చందన భూమి సర్వే నంబర్ 70, మరియు 22/ 1 లోని భూమి భూ ప్రక్షాళనలో భాగంగా కొత్త ఆన్లైన్ పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఫారెస్ట్ భూమి పేరుతో గత సంవత్సరం నుండి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇందుకోసం కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఎంసిపిఐయు ఆధ్వర్యంలో మాచారెడ్డి తహసిల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ ...
Read More »కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
ఆర్మూర్ డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం 60 మంది మహిళలకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్దిదారులకు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అందజేశారు. 1 లక్ష 1 వంద 16 రూపాయల విలువ గల 60 లక్షల 6 వందల 960 రూపాయల విలువగల చెక్కులను మహిళలకు అందజేశారు. అదేవిధంగా మేన మామ కట్నంగా పెళ్లి కానుక క్రింద ఎమ్మెల్యే వారికి చీరలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డివో శ్రీనివాసులు, ...
Read More »నత్తకే నడక… మిషన్ భగీరథ పనులు
నందిపేట్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు నత్తనడకన కొనసాగుతూ నిర్దేశించిన లక్ష్యానికి విరుద్దంగా సాగుతూనే ఉన్నాయి. ఇంటింటికి స్వచ్చ జలాన్ని అందించే బహత్తర పథకం అయిన మిషన్ భగీరథను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి దాదాపు ఐదేళ్ళు కావస్తుంది. పనులు ప్రారంభించినప్పటికి క్షేత్ర స్థాయిలో అందుకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. ఏళ్ళు గడుస్తున్నా లక్ష్యాన్ని చేదించలేక అధికారులు ఎప్పటికప్పుడు నిర్ణీత గడువు పెంచుతూ వస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్లు పనుల నిర్వహణపై నిర్లక్ష్య ధోరణి ...
Read More »గుంతల మయం – తొండాకూర్ రోడ్డు
నందిపేట్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తొండకూర్ నుండి ఖుదావన్పూర్కు వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఆర్మూర్‌కి వెళ్లే వారు తొండకూర్ నుంచి ఖుదావన్‌పూర్ మీదుగా వెళుతుంటారు. కానీ రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి సమయాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Read More »రబీ సాగు భారం
నందిపేట, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతంలో కరువు ఎదుర్కొన్న రైతాంగం ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగి సాగుకు ఇబ్బందులు లేదని సంతోషపడుతున్నారు. కానీ వ్యవసాయ రంగానికి సంబంధించిన ట్రాక్టర్ కిరాయి, కూలి రేట్లు, ఎరువుల ధరలు ఆందోళనకు చేస్తున్నాయి. వ్యవసాయం యాంత్రీకరణమవుతున్న కొద్దీ ఖర్చుల భారం అధికమవుతుంది. పెరిగిన యాంత్రీకరణ ఒకప్పుడు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే రైతులు దానికొరకు ఎద్దులు- గేదెలతో పని చేపట్టేవారు. దీంతో తక్కువ ఖర్చుతో సాగు చేసేవారు. ...
Read More »