మిషన్‌ అంత్యోదయ పూర్తి చేయండి

రెంజల్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన మిషన్‌ అంత్యోదయని పూర్తి చేయాలని డిఎల్‌పిఓ గౌస్‌ అన్నారు. మండలంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శితో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి రికార్డులో పొందుపరచి మిషన్‌ అంత్యోదయని పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ గౌస్‌, కార్యదర్శులు రఘురామ్‌, యాదగిరి, శ్రీనివాస్‌, చరణ్‌ తదితరులు ఉన్నారు.

Check Also

తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండగల వివరాలు

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *