Breaking News

మున్సిపాలిటీలలో వాహనాలు సమకూర్చుకోవడానికి చర్యలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ కార్యక్రమాల అవసరాలకు వాహనాలను సమకూర్చుకోవడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో మున్సిపల్‌ కమిషనర్లతో వాహనాల ఏర్పాటుపై సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి 500 కుటుంబాలకు ఒక స్వచ్ఛ ఆటో, 400 కుటుంబాలకు ఒక ఫోర్‌ వీలర్‌, 50 వేల జనాభాకు స్వీపింగ్‌ మిషన్‌, 500 కుటుంబాలకు ఒక టిప్పర్‌ చొప్పున సమకూర్చుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిధుల అందుబాటును బట్టి కొనుగోలు చేయడమా అద్దెకు తీసుకోవడమా ఆలోచించుకోవాలని ఇందుకుగాను 14వ ఆర్థిక సంఘం, ఎల్‌ఆర్‌ఎస్‌ నిధుల నుండి వాహనాల కొనుగోలుకు ఖర్చు చేయాలన్నారు.

వాహనాల ఖర్చుతో పాటు నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు, తదితర అన్ని ఖర్చులు పరిగణలోకి తీసుకొని వాహనాలు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్లు జాన్‌ సాంసన్‌, స్వామి, శైలజ, గంగాధర్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌ ఆనంద్‌ సాగర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పూచీకత్తు లేని రుణాలు అందించడానికి కృషి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమల‌కు గ్యారెంటీ ...

Comment on the article