ఉమెన్స్‌ ఫుట్‌బాట్‌ లీగ్‌ కార్యాలయం ప్రారంభం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉమెన్స్‌ ఫుట్‌బాట్‌ లీగ్‌ కార్యాలయాన్ని కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ అధ్యక్షుడు నరాల సుధాకర్‌ మంగళవారం ప్రారంభించారు. ఈనెల 28 నుండి జనవరి 3 వరకు జరిగే తెలంగాణ ఉమెన్స్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ కోసం కార్యాలయాన్ని స్థానిక వినాయక్‌ నగర్లో ఎస్‌ఎస్‌ పోర్ట్స్‌ అకాడమీ ప్రక్కన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మొదటిసారి తెలంగాణలో జరుప తలపెట్టిన ఉమెన్స్‌ ఫుట్‌బాల్‌ లీగును నిజామాబాద్‌ ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా దాతలు ముందుకొచ్చి కూడా సహకరించాలని కోరారు. లీగులో మొత్తం ఆరు టీమ్‌ క్లబ్‌లు పాల్గొననున్నాయని, ఒక్కొక్క క్లబ్బుకు ఒక్కొక్కరు స్పాన్సరర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

ఇంకా ఎవరైనా తెలంగాణ ఫుట్‌ బాల్‌ లీగుకు సహాయం చేయదలచిన వారు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు షకీల్‌, ఖలీల్‌ మాట్లాడుతు తెలంగాణలో జరుగుతున్న మొదటి లీగ్‌ ఇది అని తెలిపారు.

లీగ్‌ నిజామాబాద్‌లో జరగడం మన నిజామాబాద్‌ ఫుట్‌ బాల్‌కు దక్కిన గౌరవమన్నారు. తెలంగాణ ఫుట్‌బాల్‌ లీగును అందరం కలిసి విజయవంతం చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోచ్‌ గొట్టిపాటి నాగరాజు, కొయ్యాడ శంకర్‌, వహిద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాస మూడో స్థానానికే పరిమితమవుతుంది

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలలో తెరాస మూడోస్థానానికే పరిమితమవుతుందని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *