భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంకా పరిష్కరించవలసిన భూ సమస్యలపై ఆర్‌.డి.ఓ.లు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్‌లో ఆర్డీవోలతో ఎల్‌ఆర్‌యుపిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అనుగుణంగా ఇంకా పెండింగ్‌లో ఉన్న పాస్‌ బుక్కులను వెంటనే జారీ చేయటానికి చర్యలు తీసుకోవాలన్నారు.

కోర్టు కేసులు, అనర్హత కేసులు మినహా మిగతా కేసులన్నీ పరిష్కరించడానికి ప్రత్యేకంగా శ్రద్ధ కనబర్చి తహసిల్దార్లు గ్రామస్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. పరిష్కరించగల ఇంకా సంతకాలు కాకుంటే సంతకాలు చేయాలని, సంతకాలు అయిన వాటిలో ఇంకా పంపిణీ జరగని వాటిని త్వరగా రైతులకు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న పాస్‌ పుస్తకాలు కిందిస్థాయి సిబ్బంది వద్ద పంపిణీ జరగకుండా వారి వద్ద ఉంచవద్దని ఆదేశించారు.

అలా ఉన్నట్లయితే పరిశీలించి విఆర్‌ఓలపై చర్యలు తీసుకోవడంతో పాటు వెంటనే సంబంధిత రైతులకు అందేలా చూడాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఓ అంజయ్య, ఆర్‌డివోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, గోపి రామ్‌, కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌, సాంకేతిక సిబ్బంది గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాస మూడో స్థానానికే పరిమితమవుతుంది

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలలో తెరాస మూడోస్థానానికే పరిమితమవుతుందని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *