పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌కు అభిప్రాయాలు తెలపాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌కు రాజకీయ పార్టీల ప్రతినిధులు అభిప్రాయాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు కోరారు. మంగళవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో ఉన్న పోలింగ్‌ స్టేషన్లలో లోకేషన్‌లో మార్పు, పోలింగ్‌ కేంద్రాల పేర్ల మార్పు, అదనపు పోలింగ్‌ కేంద్రాలపై ప్రతిపాదనలు పంపించడం, కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్‌ తెలిపారు. ఇందుకుగాను నియోజకవర్గ స్థాయిలో సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించాలని, ఇందుకుగాను కొత్తగా ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని వివరించారు.

పోలింగ్‌ కేంద్రాలలో 1500 మంది ఓటర్లు మించితే మరొక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించిందని, అయితే అంతకు మించి జిల్లాలో ఏ పోలింగ్‌ కేంద్రంలో కూడా సంఖ్య మించనందున కొత్త పోలింగ్‌ కేంద్రాల ప్రతిపాదన రాలేదన్నారు. జిల్లాలో ఆర్మూర్‌లో 214, బోధన్‌ 246, బాన్సువాడ 237, నిజామాబాద్‌ అర్బన్‌ 281, నిజామాబాద్‌ రూరల్‌ 286, బాల్కొండ 245, మొత్తం 1509 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.

స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ కింద 2020 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి కల్పించిన అవకాశానికి సంబంధించి ఈనెల 16న డ్రాఫ్ట్‌ జాబితా ప్రచురించడం జరుగుతుందని, ఈనెల 6వ తేదీలోగా నమోదు చేసుకున్న వారి వివరాలు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తున్నామని తెలిపారు. తేదీ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి ఏడు రోజుల తర్వాత పరిశీలించడం జరుగుతుందని అన్నారు.

సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు వెంకటేశ్వర్లు, గోపిరామ్‌, శ్రీనివాస్‌, గోవింద్‌, రమేష్‌ రాథోడ్‌, జాన్‌ సాంసన్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు లక్ష్మణ్‌, సునీల్‌ యాదవ్‌, హనుమా గౌడ్‌, ప్రవీణ్‌ రెడ్డి, రాజన్న, సుధాకర్‌, రమేష్‌ బాబు, షకీల్‌ అహ్మద్‌, అజీముద్దీన్‌, మురళి, ఐజాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాస మూడో స్థానానికే పరిమితమవుతుంది

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలలో తెరాస మూడోస్థానానికే పరిమితమవుతుందని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *