Breaking News

జడ్పీ చైర్మన్‌ని కలిసిన సర్పంచులు

రెంజల్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు వికార్‌ పాషా ఆధ్వర్యంలో రెంజల్‌ మండల సర్పంచ్‌లు మంగళవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావ్‌ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్‌ పాషా మాట్లాడుతూ సర్పంచుల సంక్షేమం కోసం కషి చేయాలని, గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్‌ల కొనుగోలులో జాప్యం లేకుండా చూడాలని అన్నారు. గ్రామ పంచాయితీల అభివద్ధికి సహాయసహకారాలు అందించాలని జడ్పీ ఛైర్మన్‌ను కోరినట్లు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్‌లు బైండ్ల రాజు, సాయరెడ్డి తదితరులు ఉన్నారు.

Check Also

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల‌ను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే గిట్టుబాటు ...

Comment on the article