Breaking News

ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే మహిళలకు రక్షణ లేదు

కామారెడ్డి, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు (తెలంగాణ రాష్ట్ర మహిళ సమాఖ్య) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్తెల సజన హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల నిర్లక్ష్యంగానే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో, కేంద్రంలో, మద్యం విచ్చల విడిగా ఏరులై పారుతుందన్నారు. అలాగే ఎన్‌కౌంటర్‌ శాశ్వత పరిష్కారం కాదని ఆమె అన్నారు.

ఆలాగే ప్రభుత్వాలు మద్యపానం, అశ్లిల చిత్రాలు నిషేధించాలని అన్నారు. అలాగే సినిమాల ప్రభావం వల్ల కూడా సమాజంలో చెడు అనేది జరుగుతుందని సెన్సార్‌ బోర్డ్‌ కూడా సినిమాలపై ఎటువంటి ఆంక్షలు లేకుండా విడుదల చేస్తుందని ఆమె అన్నారు. అదే విదంగా ఎన్నో ప్రభుత్వాలు మారినా ప్రజల జీవితాలు మారడం లేదని అన్నారు.

దేశంలో, రాష్టంలోని ప్రజల నిత్యావసర వస్తుల ధరలు పెరుగుతున్నాయని కానీ ప్రజల జీతాలు మాత్రం పెరగడం లేదని, పిల్లలను చదివించే స్థితిలో కూడా లేరని వారు అన్నారు. అలాగే మైనర్‌లకు మద్యం అమ్మరాదని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు ప్రవేట్‌, కార్పొరేట్‌, శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నాయన్నారు. జిఎస్‌టి, వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

అనంతరం కామారెడ్డిలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు (తెలంగాణ మహిళ సమాఖ్య) నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు (తెలంగాణ మహిళ సమాఖ్య) కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా ఎం.రాజమని, ఉపాధ్యక్షురాలుగా చంద్రకళ, కార్యదర్శిగా ఎల్‌.శ్యామల, సహాయ కార్యదర్శిగా భూదేవి, కోశాధికారిగా పి.మానస, సుధారాణి, జిల్లా కార్యవర్గసభ్యులు రేణుక, నర్సవ్వ, కవిత, ఉమారాణి ఎన్నికయ్యారు.

Check Also

సార్‌ ఆశించిన తెలంగాణ ఇది కాదు

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతి ...

Comment on the article