Breaking News

Daily Archives: December 11, 2019

సరస్వతి మహాక్షేత్ర వార్షికోత్సవ వేడుకలు

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా అడ్లూరు మండలం ఇల్చిపూర్‌లోని శ్రీ సరస్వతి మహాక్షేత్రం మూడవ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్టు ఆలయ అభివృద్ది కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈనెల 13 నుంచి 15 వరకు సామూహిక కుంకుమార్చనలు, అక్షరాభ్యాసాలు, ఒడి బియ్యం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 15న భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

Read More »

పార్లమెంటులో ఎంపిల నిరసన

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తు బుధవారం తెరాస ఎంపిలు పార్లమెంటు ఎదుట ప్లకార్డులు చేబూని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెరాస లోక్‌సభ విప్‌ ఎంపి బి.బి.పాటిల్‌, ఇతర ఎంపిలు మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన జిఎస్‌టి బకాయిలు, వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ది నిధులను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన ...

Read More »

ఆరోగ్య కేంద్రం తనిఖీ

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ బుధవారం గాంధారి మండలం ఉట్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో రోగులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రోగులకు పూర్తిస్థాయిలో సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. సేవల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కెసిఆర్‌ కిట్‌, అమ్మ ఒడి, తదితర వైద్య పథకాలపై సమీక్షించారు.

Read More »

మహిళల్లో ఆత్మరక్షణ, మనోధైర్యం పెంపొందించేలా చర్యలు

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ప్రతి మహిళ, ఆడపిల్లలు ఆత్మరక్షణ, మనోస్థైర్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టినట్టు, ఇందుకోసం వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం కామారెడ్డిలో బాలికల స్వీయ రక్షణకు సంబంధించి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లతో మూడురోజుల టివోటి శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ నుంచి మార్చి చివరి వరకు వందరోజుల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్చంద సంస్థలు ...

Read More »

కొలిక్కి రాని భూసేకరణ

నందిపేట్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంఉమ్మెడ పుష్కర ఘాట్‌ నుండి నిర్మల్‌ జిల్లా పంచగుడి వరకు నిర్మించిన వంతెనకు కలిపే అప్రోచ్‌ ప్రధాన రహదారి కొరకు భూములు ఇస్తున్న రైతుల సంతకాల సేకరణ కొరకు ఆర్‌డిఓ శ్రీనివాస్‌ బుధవారం నందిపేట్‌ వచ్చి భూములు ఇస్తున్న రైతులతో సమావేశం ఏర్పాటు చేసారు. అయితే గోదావరికి అటు వైపు నిర్మల్‌ జిల్లాలోని పంచగుడి రోడ్డు కొరకు భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం రాలేదని తెలుసుకున్న నందిపేట్‌ మండల ...

Read More »

పాఠశాలకు బెంచీల వితరణ

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని రాంపూర్‌ ఉన్నత పాఠశాలకు రూ.30 వేల విలువ గల 20 బెంచీలను బుధవారం అందజేశారు. లయన్స్‌ జిల్లా గవర్నర్‌ లయన్‌ ఇరుకుల వీరేశం కుమారుడు సంతోష్‌ జన్మదినం సందర్భంగా పిట్లం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బెంచీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్‌ ప్రతినిధులు అనిత, రజని, సంజీవరెడ్డి, వేణుగోపాల్‌, దుబాయ్‌ రాజు, బెజగం శేఖర్‌, పాఠశాల చైర్మన్‌, ఉపాధ్యాయులు కిష్టయ్య పాల్గొన్నారు.

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో హంగర్‌ రిలీఫ్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నిజామాబాదు డైమండ్‌ ఆద్వర్యంలో బుదవారం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో హంగర్‌ రిలీఫ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉప్మా పలహారం పంపిణీ చేశారు. లయన్స్‌ జిల్లా గవర్నర్‌ వీరేశం తనయుడు సంతోష్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా అంతటా హంగర్‌ రిలీఫ్‌ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. క్లబ్‌ కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారి శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read More »

ధాన్యం కొనుగోలు చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండలం బరందండ తండాకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి తరలి వచ్చారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాండ వాసులు మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీ పరిధిలోని సొసైటీలో ధాన్యం కొనుగోలు చేయక తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నారు. నాలుగు రోజుల నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ...

Read More »

ఘనంగా వీజీ గౌడ్‌ జన్మదిన వేడుకలు

రెంజల్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ విజి గౌడ్‌ జన్మదినం సందర్భంగా రెంజల్‌ మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనతరం వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందువరుసలో నిలబడే విజి గౌడ్‌ నిండు నూరేండ్లు జీవించాలన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుని మరింత ఉన్నత పదవులు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో మండల గౌడ సంఘం సభ్యులు సాయిబాబా గౌడ్‌, ...

Read More »

కళ్యాపూర్‌లో దత్త జయంతి వేడుకలు

రెంజల్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దత్త జయంతిని పురస్కరించుకుని మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో బుధవారం దత్త జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కల్యాణం నిర్వహించారు. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. సర్పంచ్‌ కాశం నిరంజని, ఉపసర్పంచ్‌ జలయ్య ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, ...

Read More »

నిజామాబాద్‌కు లయన్స్‌ క్లబ్‌ స్వాగతం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా కేంద్రంలో బుదవారం లయన్స్‌ క్లబ్‌ స్వాగత బోర్డు ఏర్పాటు చేసింది. నగరంలోని పూలాంగ్‌ వద్ద హైదరాబాద్‌ వైపు నుండి నిజామాబాదు వైపు వచ్చే వారికి స్వాగతం పలుకుతూ బోర్డు ఏర్పాటు చేశారు. లయన్స్‌ క్లబ్‌ రీజియన్‌ చైర్మెన్‌ గోపాల్‌ దాస్‌ అగర్వాల్‌, జోన్‌ చైర్మెన్‌ ద్వారకా దాస్‌ అగర్వాల్‌ స్వాగత బోర్డును ప్రారంబించారు. ఈ సందర్భంగా రీజియన్‌ చైర్మెన్‌ గోపాల్‌ దాస్‌ మాట్లాడుతూ నగరంలోకి ప్రవేశించే వారికి స్వాగతం పలుకడంతో ...

Read More »

ఆసరా పించన్‌ల పంపిణీ

నందిపేట్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని తపాలా కార్యాలయానికి ఆసరా పింఛన్‌ దారులు బుధవారం భారీగా తరలివచ్చారు. స్థానిక తపాలా కార్యాలయం వద్ద వద్ధులు వితంతువులు, బీడీ కార్మికులు తమ ఆసరా పింఛన్‌ కొరకు ఉదయం 6 గంటలనుండి వరుస కట్టారు. ఆసరా పెన్షన్‌లు ప్రతి నెల మొదటి వారంలో పంచుతారు. కానీ డిసెంబర్‌ పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం ఆలస్యం కావడంతో బుధవారం మొదటి రోజు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రజలు తమ వెంట ...

Read More »

పశువులను మెలకువలతో పెంచండి

నందిపేట్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ ఏజెన్సీ ఆధ్వర్యంలో నందిపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో పశుసంవర్ధక శాఖ మాజీ జెడి డైరెక్టర్‌ ఖదీర్‌ పాల్గొని గొర్రె, మేకల, పాడి పశువుల పెంపకం కొరకు మెళుకువలను తెలియజేశారు. పశువులను వత్తిగా కాకుండా మెలకువలతో పెంపకం చేయాలని కోరారు. రైతులతో ముఖాముఖి చర్చలు నిర్వహించి పశువులలో ఉన్న సమస్యలు వాటి పరిష్కారాలు, సూచనలు ...

Read More »

ఘనంగా వి.జి.గౌడ్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ హామీల కమిటీ చైర్మెన్‌, తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌ గౌడ్‌ జన్మదిన వేడుకలు బుదవారం నిజామాబాదు లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెరాస కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌ కేక్‌ కట్‌ చేశారు. నిజామాబాదు రూరల్‌ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్దన్‌, డిచ్‌పల్లి మండల పరిషత్‌ అధ్యక్షుడు గద్దె భూమన్న, తెరాస నాయకుడు శ్రీనివాస్‌ రావు తదితరులు జన్మదిన వేడుకల్లో పాల్గొని విజి గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

14వ తేదీ నాటికి ధాన్యం వివరాలు అందజేయండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14 కల్లా ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని వివరాలను ట్యాబ్‌ ఎంట్రీ చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ట్యాబ్‌ ఎంట్రీ చేస్తేనే దానికి సంబంధించిన బిల్లులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని, ఈ విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పని వెంటనే పూర్తి చేయడానికి ...

Read More »

13న నీటిపారుదల సలహా బోర్డు సమావేశం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 13న ఉదయం 11 గంటలకు నిజామాబాదు ప్రగతిభవన్‌లో నీటిపారుదల సలహా బోర్డు సమావేశం జరగనుంది. జిల్లాలోని శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ భారీ ప్రాజెక్టులతో పాటు గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాలు, రామడుగు తదితర మద్యతరహా ప్రాజెక్టుల నుండి రభీ సాగుకు నీటి విడుదల గురించి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లా కలెక్టర్‌ సూచన మేరకు సమావేశం నిర్వహిస్తున్నట్టు నీటి పారుదల విభాగం పర్యవేక్షక ఇంజనీర్‌ ఎ.మురళీదర్‌ తెలిపారు.

Read More »

దిశ తల్లిదండ్రుల పట్ల జడ్పి ఛైర్మన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దిశ తల్లిదండ్రుల గురించి కామారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ దఫేదార్‌ శోభ బాధాకరమైన వ్యాఖ్యలు చేశారు. దిశ కేసులో ఆమె బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారని చెప్పవచ్చు. అంతే కాకుండా ఆడపిల్లలందరికి ప్రభుత్వం ఏ విధంగా రక్షణ కల్పిస్తుందని దఫేదార్‌ శోభ ప్రశ్నిస్తున్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా పరిషత్‌ మహిళా సంక్షేమం స్థాయి సంఘం సమావేశం జరిగింది. సమావేశంలో శోభ మాట్లాడుతూ దిశ తల్లిదండ్రులను అత్యంత హేయంగా విమర్శించారు. దిశకు, ఆమె తల్లిదండ్రులకు ...

Read More »