కామారెడ్డి, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండల బీజేపీ ఎన్నికలలో బాగంగా మండల అధ్యక్షులుగా కష్ణాజీగారి ప్రదీప్ కుమార్ రావ్‌ను ఏకగ్రివంగా ఎన్నుకున్నారు. కార్యక్రమనికి మండల ఇంచార్జి మోహన్ రావ్, మాజీ మండల అధ్యక్షులు తుమ్మ బాలకిషన్, ఎన్నికల అధికారిగా రావుల రమేష్ గౌడ్, సతీష్ యాదవ్ వ్యవహరించారు.
Read More »Daily Archives: December 12, 2019
జాతీయ సమ్మె జయప్రదం చేయండి
కామారెడ్డి, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.గంగాధర రావు హాజరు కాగా జిలా ్లఉపాధ్యక్షులు దుబ్బాస్ రాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గంగాధర్‌రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు కోర్ట్ తీర్పు ప్రకారం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనవరి ...
Read More »రాష్ట్ర స్థాయి క్రీడలకు కామారెడ్డి వేదిక
కామారెడ్డి, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలు కామారెడ్డి పట్టణంలో నిర్వహించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు. ఈ నెల 17 న పెన్షనర్స్‌డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనం అవరణలో రిటైర్డ్ ఉద్యోగులు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ...
Read More »ఉచిత మెగా వైద్య శిబిరం
నందిపేట్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని జూడ చర్చి క్యాంపస్‌లో పాస్టర్ సాల్మన్ జాషువా ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు వంద మందికి పైగా పరీక్షలు జరిపి వైద్యం చేశారు. నిత్య ఇఎన్‌టి కేర్ హాస్పిటల్ ఆర్మూర్ వారు, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన నిపుణులు డాక్టర్ చైతన్య గొంతు సమస్య, గొంతు ఆపరేషన్, ముక్కు, శ్వాసకు సంబంధించిన, ముక్కు ఆపరేషన్, ముక్కుకు సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకొని వారికి ...
Read More »13న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
కామారెడ్డి, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడమే కాకుండా వారిలో ఉండే నైపుణ్యాలను వెలికి తీయడం కోసం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఈ నెల 13న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల కొత్తగా ప్రారంభించిన మినీ స్టేడియంలో క్రీడలు జరగనున్నాయి. 18 సంవత్సరాలలోపు బాలబాలికలతో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు. అదే రోజు ...
Read More »మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
కామారెడ్డి, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం మండలంలోని అంబర్‌పేట, గొట్టుముక్కల గ్రామాలలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ సందర్భంగా దోమకొండ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ ఆసుపత్రిలో వసతులు, వైద్యులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడి చంద్రమోహన్ రెడ్డి, తహసిల్దార్ ...
Read More »ఇచ్చిన మాట ప్రకారం సిసి రోడ్లు వేయిస్తున్నాం
నిజామాబాద్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో ప్రధాన రోడ్లను ఎటువంటి కూల్చివేతలు లేకుండా విస్తరణతో పాటు అభివద్ధి చేయడం జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త అన్నారు. నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్ అంబేడ్కర్ కాలనీలో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గురువారం భూమిపూజ చేసి ప్రారంబించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. దాదాపు అన్ని రోడ్లు పూర్తి చేయడం ...
Read More »పేకాట రాయుళ్ల అరెస్ట్
నందిపేట్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం బాద్గుణ గ్రామ శివారులో గురువారం సాయంత్రం పోలీసులు పేకాట స్థావరంపై దాడిచేశారు. ఐదు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద గల పేక ముక్కలను, 15 వేల 50 రూపాయలను స్వాధీనం చేసుకొన్నారు. స్థానిక ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం పేకాట ఆడుతున్న సమాచారం అందుకుని పకడ్బందీ ప్రణాళికతో వెళ్లి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా పేకాట ఆడుతున్నట్టు తెలిస్తే పోలీస్ స్టేషన్‌కు లేదా ఎస్ఐ ...
Read More »బెల్టు షాపులపై దాడి
రెంజల్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని రెంజల్, పేపర్ మిల్, బొర్గం గ్రామాలలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం మేరకు బెల్ట్ షాపులపై బుధవారం రాత్రి దాడులు నిర్వహించి 98 మద్యం బాటిళ్లను స్వాధీనపర్చుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Read More »ఉచిత క్యాన్సర్ అవగాహన శిబిరం
నవీపేట్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లా నవీపేట్ మండలం సిరన్‌పల్లి గ్రామంలో క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టినరోజు సందర్బంగా యువీకాన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ అవగాహన శిబిరం నిర్వహించారు. నిజామాబాదు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు శిబిరాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ విశాల్, నవీపేట సర్పంచ్ ఎటిఎస్ ...
Read More »రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ – పిఎస్‌కు తరలింపు
నందిపేట్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలం ఆంధ్ర నగర్ గ్రామంలో రోడ్డుకు అడ్డంగా పార్కింగ్ చేసిన ట్రాక్టర్‌ను బుధవారం రాత్రి పోలీసులు పిఎస్‌కు తరలించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రనగర్ గ్రామంలో నిజామాబాద్ నుండి నందిపేట్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన బుధవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ మళ్లించాలనే ఉద్దేశంతో మెయిన్ రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ నిలిపారు. అయితే జిల్లా కేంద్రానికి వెళ్లిన వారు రాత్రి సమయంలో తిరుగు ప్రయాణం నందిపేట ...
Read More »క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే
నిజామాబాద్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పాలి టెక్నిక్ కాలేజీలో అంతర జిల్లా క్రీడా పోటీలను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గురువారం ప్రారంబించారు. క్రీడా పతాకాన్ని ఎగురవేసి ఆదిలాబాద్, నిర్మల్ నిజామాబాద్, పాలి టెక్నిక్ క్రీడా కారుల నుండి గౌరవ వందనం స్వీకరీంచారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ చదువులోనే కాకుండా ఆట పాటల్లో కూడా విద్యార్థులు ముందుండాలన్నారు. ఆటలు మానసిక ఉల్లాసంతో పాటు శరీరం ఫిట్‌గా ఉండటానికి ఉపయోగ పడతాయన్నారు. ఆటల్లో గెలుపు ...
Read More »ఘనంగా దత్తజయంతి వేడుకలు
రెంజల్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దత్త గురు పౌర్ణమి పురస్కరించుకుని మండలంలోని కూనేపల్లి గ్రామంలోని సాయిబాబా ఆలయంలో గురువారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయ, గ్రామస్థులు లింగం, సాయిలు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Read More »పల్లెల్లో పరిశుభ్రత పనులు జరగాలి
నిజామాబాద్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో అభివద్ధి కార్యక్రమాల పనులు కొనసాగిస్తూనే ఉండాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు మండల స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, డివిజనల్ పివోలు, ఏపీవోలతో పలు విషయాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి పనులలో ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై పల్లెలను అందంగా తీర్చిదిద్దారని, గ్రామాలు హరిత వనాలుగా అభివద్ధి చెందడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తెలిపారు. అయితే ...
Read More »ప్రభుత్వ ప్లీడర్‌గా ఈగ గంగారెడ్డి
నిజామాబాద్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లా కోర్టు ప్రభుత్వ ప్లీడర్‌గా సీనియర్ న్యాయవాది ఈగ గంగారెడ్డి నియమితులయ్యారు. గురువారం గంగారెడ్డి ప్రభుత్వ న్యాయవాదిగా బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కోర్టులో నిజామాబాదు జడ్పిచైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, ఈగ గంగారెడ్డిని సన్మానించారు. పిపి మధుసూదన్ రావు, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.రమేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read More »ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు
రెంజల్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్ బలరాం అభినందనలు తెలిపారు. పాఠశాల విద్యార్థులు ఈ నెల 3 న ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన అండర్ 17 హ్యాండ్‌బాల్ పోటీలో రెండవ స్థానాన్ని సాధించడంతో వారికి బహుమతులు అందజేస్తూ అభినందనలు తెలిపారు. అండర్ 17 హ్యాండ్‌బాల్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలలో విద్యార్థిని పాల్గొననున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రవీణ్, ఉపాధ్యాయులు ...
Read More »మూడు రోజులపాటు మీ సేవా కేంద్రాలు బంద్
నిజామాబాద్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మీ సేవా డేటాబేస్ కార్యకలాపాలను మెరుగుపరచడంలో భాగంగా మీసేవ సేవలు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 13వ తేదీ రాత్రి 7 గంటల నుండి 16వ తేదీ ఉదయం 8 గంటల వరకు పనిచేయవని, అందుబాటులో ఉండవని జిల్లా ఇ- డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. 16వ తేదీ ఉదయం 8 గంటల తర్వాత మీసేవా సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముందని ప్రజలందరూ సహకరించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
Read More »