నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమవుతుందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రహదారులు- భవనముల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ మైదానంలో గ్రామ పంచాయతీలకు పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సంబంధిత గ్రామ పంచాయతీల సర్పంచులకు ట్రాక్టర్లను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో ప్రారంభించిన 30 రోజుల పల్లె ...
Read More »Daily Archives: December 13, 2019
మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన
రెంజల్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళల భద్రత కోసం నా భద్రత నా పోలీస్ అనే అంశాలపై శుక్రవారం మండలంలోని కందకుర్తి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. నేటి సమాజంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు అధికంగా జరుగుతున్నాయని వాటిని నివారించడానికి మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. సమాజంలో అధికంగా జరుగుతున్న దాడులు నివారించడానికి కావాల్సిన జాగ్రత్తలు యువకుల పాత్రపై విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ...
Read More »యాసంగికి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ప్రతిపాదనలు
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగిలో 2 లక్షల 45 వేల ఎకరాల్లో సాగుకు గాను 20 టీఎంసీల నీటిని అందించడానికి జిల్లా నీటి పారుదల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగిందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రహదారులు- భవనముల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారుం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నీటి పారుదల సలహా కమిటీ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ...
Read More »22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష
కామారెడ్డి, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్ను కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు గణితంలో మంచి మార్కులు సాధించడానికి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రామానుజన్ జయంతి సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ...
Read More »పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా 19న నిరసన
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న పౌరసత్వ చట్టం సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని సిపిఎం నిజామాబాదు జిల్లా కార్యదర్శి కె రమేష్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 19న నిరసన కార్యక్రమాన్ని వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సిపిఎం నాయకులు పెద్దివెంకట్ రాములు, ఎం.గంగాధర్ అప్ప పాల్గొన్నారు.
Read More »అద్దె భవనాల్లో అంగన్ వాడీ కేంద్రాలు
నందిపేట్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తూ చిన్న పిల్లలకు పాఠశాల ఎలిమింటరి విద్యను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాలను నడుపుతుంది. అయితే వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. సంపూర్ణ ఆరోగ్యరక్షణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా చిన్నారులు చదివే అంగన్ వాడి కేంద్రాలకు పక్కా భవనాలు లేకపోవడంతో ఆశించిన ప్రయోజనాలు చేకూరడం లేదు. అద్దె భవనాల్లో అసౌకర్యాల మధ్య అవస్థలు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలైన మరుగుదొడ్లు , నీటి సౌకర్యం లేక ...
Read More »ఉచిత కంటి వైద్య శిబిరం
ఆర్మూర్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఆద్వర్యంలో శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఆప్తాల్మిక్ అసిస్టెంట్ రాజు నేత్ర పరీక్షలు నిర్వహించారు. మొత్తం 29 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో ఏడుగురికి మోతిబిందు ఉన్నట్లు గుర్తించి వారిని శస్త్రచికిత్స నిమిత్తం లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పెండ్యాల జీవన్ సాగర్ రెడ్డి, వెంకటేశ్వవర్లు, రాజేందర్, పోశెట్టి, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Read More »ఎన్ఆర్సి బిల్లు రద్దు చేయాలి
రెంజల్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన క్యాబ్ బిల్లుకు వ్యతిరేకంగా మండలంలోని జమతే ఉలుమ సంస్థ సభ్యులు తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ అసాదుల్లా ఖాన్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ. ఎన్ఆర్సి పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్) భారతదేశ రాజ్యాంగం యొక్క లౌకిక ఆదేశాలను మరియు ప్రజల యొక్క మతపరమైన విశ్వాసానికి విరుద్ధంగా ఉందని ఇట్టి బిల్లును కేంద్రప్రభుత్వం రద్దు చేయాలని అన్నారు. కార్యక్రమంలో జమతే ఉలుమ సభ్యులు పాల్గొన్నారు.
Read More »సీఎం సహాయనిధి చెక్కు అందజేత
రెంజల్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రానికి చెందిన నరేష్ అనారోగ్యానికి గురి కాగా ఆయన కుటుంబానికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.24 వేలు, ఎర్ర లింగారెడ్డికి రూ.26 వేలు, కునేపల్లి గ్రామానికి చెందిన సారిక కుటుంబానికి రూ.24 వేలు, పేపర్ మిల్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ కు రూ.48 వేలు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును శుక్రవారం రెంజల్ సర్పంచ్ రమేష్, టిఆర్ఎస్ నాయకులు రఫిక్ చేతుల మీదుగా అందజేశారు. ఈ ...
Read More »ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
నందిపేట్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని జూడా చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ విశ్వాసులు మండలంలోని మారుమూల గ్రామాల నుండి అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. చర్చి పాస్టర్ సాల్మన్ జాషువా ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుక ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుండి బెరాకా మినిస్ట్రీస్ టీవీ ప్రసంగీకులు ఏసు పాదం విచ్చేశారు. వేడుకల్లో పిల్లలు, పెద్దలు, యువకులు, వద్ధులు పాల్గొన్నారు. ఇతర మండలాల పాస్టర్లు, సుమారు 400 ...
Read More »రుణాలతోనే దేశాభివృద్ది
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదలు, రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే దేశం, బ్యాంకులు అభివద్ధి చెందుతాయని రాష్ట్ర రహదారులు- భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రి జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ కొన్ని బ్యాంకులు వాటి శాఖలు రైతులకు, ...
Read More »మీసేవ కేంద్రాలు పని చేస్తాయి
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా డిబి మైగ్రేషన్ ప్రక్రియ వాయిదా పడిందని ఈడిఎం కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల అన్ని మీసేవా, ఇసేవా సేవలు ఈనెల 14, 15 తేదీలలో శనివారం, ఆదివారం అన్ని కేంద్రాలలో ఎటువంటి అంతరాయం లేకుండా యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు. విషయాన్ని గమనించి ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని, మీసేవా నిర్వాహకులు తమ సేవలు అందించాలని సూచించారు.
Read More »