Breaking News

Daily Archives: December 14, 2019

ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలలో ఆధార్‌ నమోదు కేంద్రం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలలో ఆధార్‌ నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు. విద్యార్థులు వారి కుటుంబ సభ్యులకు ఆధార్‌ కార్డు తప్పుల సవరణ, నూతన కార్డుల నమోదు కోసం పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో ఆధార్‌ నమోదు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో పోస్టల్‌ శాఖ అధికారి సాయిరెడ్డి, పాఠశాల కరస్పాండెంట్‌ మామిడాల మోహన్‌, ఇన్‌చార్జి గంగాధర్‌, ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం, పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

మతపరంగా పౌరసత్వం ఇవ్వడం ప్రమాదకరం

కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ మూదాం ప్రవీణ్‌, నరేష్‌ కుమార్‌ మాట్లాడుతూ మతపరంగా పౌరసత్వం ఇవ్వొద్దని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం 2019 (సిఏబి) తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అదేవిదంగా స్త్రీలపై సమాజంలో మార్పు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని కాశాయికరణ చేయాలనే కుట్రతో పౌరసత్వం సవరణ చట్టం తీసుకువచ్చిందని, ఆర్టికల్‌ 14 కు ...

Read More »

సహజ వనరులు పొదుపుగా వాడుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహజ వనరుల పొదుపే రేపటి భవిష్యత్తని లేకపోతే భావితరాల మనుగడ కష్టసాధ్యమని మాక్లూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కదం శివాజీ అన్నారు. శనివారం వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవాన్ని మాక్లూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ నిత్యజీవితంలో చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా బొగ్గు, నీరు, పెట్రోల్‌, సహజ వాయువు, తదితర వనరులను పొదుపు చేసి ...

Read More »

భారత్‌ బచావో ర్యాలీకి కామారెడ్డి కాంగ్రెస్‌ నేతలు

కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసీసీ పిలుపులో భాగంగా ఢిల్లీ లోని రామ్‌ లీల మైదానంలో చేపట్టనున్న భారత్‌ బచావో ర్యాలీ కార్యక్రమానికి కామారెడ్డి కాంగ్రెస్‌ నాయకులు తరలివెళ్లారు. డిసిసి అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు, గూడెం శ్రీనివాస్‌ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాసుల బాలరాజు, చందూర్‌ జడ్పిటిసి అంబర్‌ సింగ్‌, చందూర్‌ ఎంపిపి రామ్‌ రెడ్డి, కోటగిరి ఎంపిటిసి కొట్ట మనోహర్‌, బాన్సువాడ మాజీ ఉపసర్పంచ్‌ కమ్రు భాయ్‌, వార్డ్‌ నెంబర్‌ సభ్యులు నరసన్న చారి, ...

Read More »

పాఠశాలకు మైక్‌ వితరణ

నందిపేట్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం తొండకూర్‌ జడ్‌.పి.హెచ్‌.ఎస్‌ హైస్కూల్‌కు గ్రామానికి చెందిన బోగ్గుల గంగామణి 6 వేల 500 రూపాయల విలువగల మైక్‌ సెట్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయునికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌ మాట్లాడుతు గంగామణి ముగ్గురు పిల్లలు తమ పాఠశాలలో చదువుతున్నారని, ప్రభుత్వ పాఠశాలలో చదివించడంతో పాటు పాఠశాల అభివద్ధికి దాతలు ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. పలువురు తల్లి దండ్రులు సంతోషం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో ఎంపిటిసి ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి నిజామాబాదు నగరంలో నిరాశ్రయులైన పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్‌, బస్‌ స్టాండ్‌, గాంధీచౌక్‌ తదితర ప్రాంతాలలో చలికి వణుకుతూ రోడ్లపై నిద్రిస్తున్న వారికి లయన్స్‌ సభ్యులు రగ్గులు అందజేశారు. ప్రతీ సంవత్సరం చలి కాలంలో చలి వల్ల ఇబ్బందులు కలగకూడదని రగ్గులు పంపిణీ చేస్తామని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ ...

Read More »

సిఎం సహాయనిధి అందజేత

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శంకరంపేట్‌ మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన బాయీకాడి వెంకన్న భార్య ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 50 వేల రూపాయల చెక్కును మహారెడ్డి భూపాల్‌ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆపద్బాంధవుడు అని అన్నారు. మండల ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, గ్రామ సర్పంచ్‌ మల్లేష్‌ తదితరులు ఉన్నారు.

Read More »