Breaking News

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి నిజామాబాదు నగరంలో నిరాశ్రయులైన పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్‌, బస్‌ స్టాండ్‌, గాంధీచౌక్‌ తదితర ప్రాంతాలలో చలికి వణుకుతూ రోడ్లపై నిద్రిస్తున్న వారికి లయన్స్‌ సభ్యులు రగ్గులు అందజేశారు.

ప్రతీ సంవత్సరం చలి కాలంలో చలి వల్ల ఇబ్బందులు కలగకూడదని రగ్గులు పంపిణీ చేస్తామని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ చైర్మెన్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పూచీకత్తు లేని రుణాలు అందించడానికి కృషి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమల‌కు గ్యారెంటీ ...

Comment on the article