Breaking News

దూపల్లిలో ఘనంగా బోనాల పండుగ

రెంజల్‌, డిసెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దూపల్లి గ్రామంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్‌ సంఘం ఆలయ 8వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల పండుగను ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాల పండుగ ఉత్సవాన్ని గ్రామస్థులంతా కలిసి ఓకే చోటుకి చేరి బోనాలతో తరలి వెళ్ళారు.

ముదిరాజ్‌ కులస్తులు అందరూ ఒకేచోట చేరి బోనమెత్తుకుని అమ్మవారి ఆలయం వద్దకు మంగళ వాద్యాలతో ఘనంగా తరలి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పాడి పంటలు చల్లాగా ఉండాలని ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహిస్తారని ముదిరాజ్‌ సంఘం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో బాబాన్న, రాములు, గంగాధర్‌, బాబు, సాయిలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కందకుర్తి శాఖా వార్షికోత్సవం

బోధన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కందకుర్తి శాఖా వార్షికోత్సవాన్ని గురువారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *