Breaking News

ఒకరి నేత్ర దానం…

కామారెడ్డి, డిసెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఒకరు నేత్రదానం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని భారత్‌ రోడ్‌ చిన్న కసాబ్‌ గల్లీకి చెందిన గౌరని నర్సింలు (56) జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని సోషల్‌ వెల్పేర్‌ డిపార్టుమెంటులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రకు ఉపక్రమించేందుకు పై అంతస్తు గదిలోకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు మెట్లు జారీ కింద పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళారు.

వెంటనే స్థానిక జయ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మతి చెందారు. కుటుంబ సభ్యుల అనుమతితో ఎల్‌.వి. ప్రసాద్‌ కంటి ఆసుపత్రి సిబ్బంది నర్సింలు నేత్రాలను సేకరించారు. మతునికి భార్య, ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు.

Check Also

కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించుమని ప్రార్థన

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష ...

Comment on the article