Breaking News

Daily Archives: December 16, 2019

ప్రభుత్వ విప్‌ పాదయాత్ర

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయం నుండి మద్దికుంట బుగ్గ రామేశ్వర్‌ ఆలయం వరకు ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో తెరాస పార్టీ మైనారిటీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు యం.కె.ముజీబ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Read More »

పేదల కోసమే కళ్యాణలక్ష్మి

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదల కోసమే ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని ఏర్పాటు చేసిందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్‌ అన్నారు. మాచారెడ్డి, రాజంపేట మండలాలకు చెందిన 33 మందికి 35 లక్షల రూపాయల చెక్కులు పంపిణి చేశారు.

Read More »

ఐదుగురికి ఆర్మీలో చోటు

రెంజల్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మీలో వెలువడిన ఫలితాల్లో రెంజల్‌ మండలం నుండి ఐదుగురు యువకులు ఆర్మీలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మండలంలోని కూనేపల్లి గ్రామానికి చెందిన దేవుడొల్ల సాయికుమార్‌, కళ్యాపూర్‌ గ్రామం నుండి రాజు, అరవింద్‌, రెంజల్‌ గ్రామం నుండి సాయికుమార్‌, అఖిల్‌లు ఎంపికయ్యారు. శనివారం వెలువడిన ఆర్మీ ఫలితాల్లో రెంజల్‌ మండలం నుండి ఐదుగురు యువకులు ఎంపికపట్ల మండలపరిషత్‌ అధ్యక్షురాలు లోలపు రజినీ, జడ్పీటీసీ సభ్యురాలు మేక విజయ హర్షం వ్యక్తం చేశారు. దేశసేవే లక్ష్యంగా ఆర్మీలో ...

Read More »

ఉమ్మడి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజ్‌ 20, 21, 22 ద్వారా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్దేశించుకున్నామని, పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర రహదారులు- భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో కలిసి బినోల, సారంగాపూర్‌, మంచిప్ప, మెంట్రాజ్‌పల్లి, సుద్ధపల్లి తదితర ప్రాంతాల్లో ప్యాకేజీ 20, 21ఏ లలో పర్యటించి కొనసాగుతున్న పైపులైను, సైట్‌ ఇన్స్‌పెక్షన్‌, పంప్‌ ...

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బాల్కొండ ఆద్వర్యంలో సోమవారం బాల్కొండ మండల కేంద్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 56 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో పదకొండు మందికి మోతిబిందు ఉన్నట్లు గుర్తించి, వారిని శస్త్రచికిత్స నిమిత్తం నిజామాబాదు లయన్స్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. బాల్కొండ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు పెండ్యాల జీవన్‌, క్లబ్‌ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కామ్రేడ్‌ ఎల్లన్న స్ఫూర్తితో ఉద్యమాలను నిర్మించాలి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు కామ్రేడ్‌ పిట్ల ఎల్లన్న 28 వ వర్ధంతి సందర్భంగా న్యూ డెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో ఎల్లన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నాయకులు దేవరాం మాట్లాడుతూ రాడికల్స్‌ మూకలు శత్రువు మిత్రుడు తేడా మరిచి 1991 డిసెంబర్‌ 16న అతి కిరాతకంగా కాల్చి చంపారన్నారు. తమ ఆధిపత్యం కోసం ప్రజల కోసం పని చేసి ప్రజల మధ్య ఉండే ...

Read More »

విఎన్‌ఆర్‌ పాఠశాలలో తల్లిదండ్రులకు పాదపూజ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా కేంద్రంలోని సాయినగర్‌ విఎన్‌ఆర్‌ పాఠశాలలో సోమవారం తల్లితండ్రుల పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ జానపద గాయకులు ఆష్ట గంగాధర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పిల్లల కోసం తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలతో పాటు బాధ్యతల గురించి తన మాట, పాటల ద్వారా ఈ సందర్భంగా గంగాధర్‌ వివరించారు. అమ్మ త్యాగాన్ని, పిల్లల ఉన్నతి కోసం నాన్న పడే తపనను అమ్మానాన్నల పాటల ద్వారా వివరించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల ...

Read More »