నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్రాంత ఉద్యోగుల అపార అనుభవం సమాజానికి ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు కోరారు. ఈ నెల 17న పెన్షనర్స్ డే పురస్కరించుకుని 13 నుండి 17 వ తేదీ వరకు నిర్వహించిన విశ్రాంత ఉద్యోగుల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిటైర్మెంట్ వయసుకే కానీ శరీరానికి కాదని, 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా ఎందరో విశ్రాంత ఉద్యోగులు ఎన్నో సంఘ ...
Read More »Daily Archives: December 17, 2019
ఎన్ఆర్సి, క్యాబ్ బిల్లు రద్దుచేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మతం ముసుగులో సెక్యులర్ భారతదేశ ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రంలోని బిజెపి సర్కారు ఎన్ఆర్సి బిల్లును, క్యాబ్ బిల్లును పార్లమెంటులో, రాజ్యసభలో ఆమోదింపజేసుకుందని ఆరోపించారు. వాటిని తక్షణం రద్దు చేసి భారతదేశ సెక్యులరిజంను ...
Read More »22వ ప్యాకేజీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాళేశ్వరం (ప్రాణహిత-చేవెళ్ళ) సాగునీటి 22వ ప్యాకేజీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్ 21,22,21 (ఎ) పనులను పర్యవేక్షించేందుకు నిజామాబాద్‌కు వచ్చారని, ఆమె పర్యటనకు కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు వెళ్లకపోవడం వారికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్దిని స్పష్టం చేస్తోందని విమర్శించారు. లక్ష 40 ...
Read More »విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశనికి నరేష్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యారంగాన్ని అభివద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. అంతే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రభుత్వ విద్యా సంస్థలను మూసి వేసి ప్రైవేటు, కార్పొరేట్‌కి వత్తాసు పలుకుతూ ప్రభుత్వం వారి కబంధ హస్తాల్లో పనిచేస్తుందని ఆవేదన వ్యక్తం ...
Read More »దేశంలో నివసించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు 2019 విద్యార్థిలోకం వ్యతిరేకించాలని పిడిఎస్యు నిజామాబాద్ డివిజన్ కమిటీ డిచిపల్లి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా పివైఎల్, పిడిఎస్యు అధ్యక్షులు సాయినాథ్, అరుణ్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తుందని, ముస్లింలను దేశంలోకి రానీయకుండా ఈ చట్టం తీసుకువచ్చిందని, దేశంలో నివసించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. నేడు దేశంలో పుట్టిన ...
Read More »కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మంగళవారం కల్యాణ లక్ష్మీ చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అభివద్ధి సంక్షేమంలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. తనను గెలిపించిన నగర ప్రజల రుణం తీర్చుకోవడానికి చెక్కుతో పాటుగా పెళ్లి కూతురుకి చీర, పెళ్లి కొడుక్కి ఒక జత ...
Read More »గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఐక్యంగా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేందుకు కషి చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. మంగళవారం డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ విబేధాలు మరిచిపోయి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రకళ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు భోజన్న, ...
Read More »పాఠశాలకు ఆర్థిక సహాయం
నందిపేట్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ లోని ఐలాపూర్ పాఠశాలకు గ్రామానికి చెందిన గాదె శ్రీనివాస్ 10 వేల రూపాయలు, బొంత సిద్దు 5 వేల రూపాయలు పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు ప్రవీణకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వార్డ్ మెంబర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత ఉన్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో- నాణ్యమైన విద్య అందుతుందనే భావంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నానని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలకు ఫీజులు చెల్లించే ...
Read More »బీడీ కార్మికులకు ఆధార్ లింక్ తొలగించాలి
నందిపేట్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు మంగళవారం తహసీల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తహసిల్దార్ రవీందర్ నాయక్ అందుబాటులో లేనందున రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ మాట్లాడుతూ బీడీ కార్మిక మహిళలు, బీడీ కార్మికుల పిఎఫ్ ఫారం 9 లో పేర్కొన్న పుట్టిన తేదీలను, ఆధార్ కార్డులలో (కెవైసి) నమోదులో ఎదురైన సమస్యను ...
Read More »జ్ఞాన చైతన్య యాత్రకు అపూర్వ స్వాగతం
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడుగు, బలహిన వర్గాల విద్యార్థులకు ప్రేరణ ఇవ్వడానికి చేపట్టిన చైతన్య యాత్ర జనవరి 20 న అలంపూర్ నియోజకవర్గం నుండి ప్రారంభమైన ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర నిజామాబాద్ జిల్లాకు సోమవారం చేరుకుంది. నియోజకవర్గంలోని సిహెచ్ కొండూరు గ్రామ యువకులు, విద్యార్థులు మంగళవారం అపూర్వ స్వాగతం పలికారు. పల్లె పల్లెకు స్వేరోస్ని పరిచయం చేద్దాం, పల్లె పల్లె పాట చైతన్యానికి బాట, బాల కార్మికులు లేని సమాజాన్ని తయారు చేద్దాం అనే ...
Read More »మాక్లూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లా మాక్లూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం మండల కార్యాలయంలో జరిగింది. సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మాక్లూర్ మండలంలో జరిగే అభివద్ధి పనులపై వివిధ శాఖల పనితీరుపై విఠల్ రావు చర్చించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాక్లూర్ ఎంపీపీ ప్రభాకర్‌తో పాటు వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read More »ధాన్యం కొనుగోలు నమోదు ప్రక్రియ మరింత వేగవంతం
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలను మరింత వేగంగా ఆన్లైన్లో నమోదు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్లో ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కొనుగోలు కేంద్రంలో ఒకటే ట్యాబ్ ఉపయోగించడానికి అవకాశమున్నందున, పగటిపూట సాంకేతిక సమస్యతో సర్వర్ ఇబ్బందితో అనుకున్నంత వేగంగా వివరాలు నమోదు కావడం లేనందున, ...
Read More »పౌరసత్వ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పౌరసత్వ సవరణ బిల్లు 2019 ను వ్యతిరేకిస్తూ పి.డి.ఎస్.యు, ఎస్.ఐ.ఓ, ఎన్.ఎస్.యు.ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, ఎస్ఐఓ నగర అధ్యక్షులు మహమ్మద్ ఖలీల్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి విపుల్ గౌడ్ మాట్లాడుతూ మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం అనేది లౌకిక ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనదన్నారు. మోడీ, షాలు ప్రజల్ని విభజించి పాలించాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. దేశంలో ...
Read More »8న జాతీయ సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2020 జనవరి 8 న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియూసి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించిన మెడికల్ కాంట్రాక్టు కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు సుధాకర్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read More »ప్రమాదకర గుంతలు
నందిపేట్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని రాజ్ నగర్ కాలనీలో పాత ఉర్దూ స్కూల్ వద్ద గల రోడ్డుపై ప్రమాదకర గోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయంలో వీటిని గమనించని వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కాలనీ వాసులు ఇట్టి ఇబ్బందులను ప్రజాప్రతినిధులు, అధికారుల దష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని వాపోయారు. పాత ఉర్దూ స్కూల్లో మైనార్టీ ప్రజలు పెళ్లిల్లు- శుభ కార్యాలు నిర్వహిస్తుంటారు. అక్కడ వచ్చే మిత్రులకు రోడ్డుపై ఉన్న గుంతల ...
Read More »పల్లె ప్రగతి కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోండి
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 2 నుండి ప్రారంభమయ్యే పల్లె ప్రగతి పనులకై ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏయే పనులు నిర్వహించాలో గ్రామ సభ ద్వారా తీర్మానం చేయాలని తెలిపారు. అదేవిధంగా గడచిన 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్వహించే పనులు చేసిన ఖర్చులపై కూడా గ్రామ ...
Read More »