Breaking News

Daily Archives: December 18, 2019

కలెక్టర్‌ను కలిసిన ఆసరా పెన్షన్‌ సంచాలకులు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఆసరా పెన్షన్‌ సంచాలకులు నవీన్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావును కలిశారు. బుధవారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల డిఆర్‌డిఎ సిబ్బంది, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ను కలిసి డిఆర్‌డిఎ అందిస్తున్న పెన్షన్‌, సదరన్‌ క్యాంపు నిర్వహణ, ధవ పత్రాల జారీ తదితర విషయాలపై చర్చించారు. వారి వెంట డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌ ...

Read More »

పల్లె ప్రగతికి సిద్దమవుతున్న అధికారులు

నందిపేట్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలను అభివద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత సెప్టెంబరులో ’30 రోజుల ప్రణాళిక’ కార్యక్రమంతో పల్లె సమస్యలను ఒకింత దూరం చేయగా, అప్పట్లో మిగిలిన ఇతర సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. రెండో విడత పల్లె ప్రగతి పనులు జనవరి 2 నుంచి పది రోజులపాటు కొనసాగనున్నాయి. మొదటి విడత స్ఫూర్తితో రెండవ విడత గ్రామాలలో ప్రత్యేక దష్టి సారించి పెండింగ్‌ పనులను పూర్తి చేయనున్నారు. జిల్లాలో రెండో ...

Read More »

మధ్యాహ్న భోజనం తిని విద్యార్థుల అస్వస్థత

బాన్సువాడ, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 30 మంది విద్యార్థులు సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు నీరజ వెంకట్రాంరెడ్డి, భగవాన్‌ రెడ్డి, తెరాస నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అస్వస్థతకు గురైన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో చర్చించారు. విద్యార్థులకు తగిన వైద్యం అందించాలని, పూర్తిగా ...

Read More »

పాత సీసా కొత్త ధర

నందిపేట్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒక రోజు క్రితం ప్రభుత్వం మద్యం ధరలను అన్ని రకాలపై దాదాపు 20 శాతం పెరుగుదల చేసిన విషయం విధితమే. ఇప్పుడున్న ధరలతో పోలిస్తే అన్ని రకాల బ్రాండ్లపై సగటున 20 శాతం పెంచింది. అయితే దీనిని అదనుగా చేసుకుని వైన్‌ షాప్‌ యజమానులు అత్యుత్సాహంతో 20 రూపాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వైన్స్‌ వారిని ప్రశ్నిస్తే అధిక ధరలు వచ్చాయని చెప్పి పాత ధరల ఎమ్మార్పీలను అంటగడుతున్నారు. ఇప్పుడున్న మద్యాన్ని దుకాణ ...

Read More »

సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

రెంజల్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత సంవత్సరం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ మండల బిజెపి ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను హామీల పేరుతో మోసపూరిత రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని, గత ఆరు ...

Read More »

వైను షాపుల్లో ఎక్సైజ్‌ అధికారుల తనిఖీలు

నందిపేట్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం డొంకేశ్వర్‌ గ్రామ వైన్‌ షాపులో ఎన్‌ఫోర్సుమెంట్‌ ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైన్‌ షాపులో ని స్టాక్‌ వివరాలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ నందగోపాల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త మద్యం ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మద్యం షాపుల్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు. కొత్త మద్యం బాటిళ్లను మాత్రం పెరిగిన ధరల ప్రకారం విక్రయించాలని, పాత స్టాక్‌ మద్యం బాటిళ్లను ఎమ్మార్పీ ధరలకు ...

Read More »

రోడ్డు సౌకర్యం కల్పించండి

రెంజల్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పేపర్‌ మిల్‌ గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని నిరసిస్తూ పేపర్‌ మిల్‌ గ్రామస్తులు బుధవారం మండల పరిషత్‌ కార్యాలయం, తహసిల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, వినతి పత్రాలు సమర్పించారు. గ్రామంలో అభివద్ధి కొరకు రోడ్డు పనులను చేపట్టడంతో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గ్రామంలో నిర్వహిస్తున్న రోడ్డు పనులను ఆటంకం కలిగిస్తున్నాడని, రోడ్డు పనులను అడ్డుకున్న గ్రామస్తులు బుధవారం ఎంపిడివో, తహసిల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ...

Read More »

ఘనంగా సెమి క్రిస్మస్‌ వేడుకలు

నందిపేట్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం లోని సీ.హెచ్‌ కొండూరు గ్రామంలో సెమి క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల ప్రజలు సంఘ విష్వసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలో భాగంగా చిన్నారులు, క్రైస్తవ పెద్దలు, వద్దులు, యవ్వనులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. వేడుకకి ముఖ్య అతిథిగా సందేశకులు దైవజనులు బోడా రాకేష్‌ నాయక్‌ (మానవ హక్కుల నేర నిరోధక చట్టం నేషనల్‌ చైర్మన్‌) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాది ...

Read More »

ఛలో హైదరాబాద్‌ గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టుల అపరిష్క త సమస్యలు పరిష్కరించే దిశగా ఆల్‌ ఇండియా వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (ఏడబ్ల్యుజెఎ) రెండవ జాతీయ మహాసభలు హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జనవరి 3న నిర్వహించనున్నారు. ఏడబ్ల్యూజేఏ జాతీయ అధ్యక్షులు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగే జాతీయ మహాసభలకు సంబంధించిన గోడ ప్రతులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు కోటేశ్వరరావు, జాతీయ మహాసభలకు కిషన్‌ రెడ్డిని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏడబ్ల్యూజేఏ ...

Read More »

రాష్ట్రస్థాయి పోటీలకు మానస స్కూల్‌ విద్యార్ధిని

ఆర్మూర్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి మానస స్కూల్‌కి చెందిన మమత రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు ఎంపికైనట్టు పాఠశాల కరస్పాండెంట్‌ మానస గణేశ్‌ తెలిపారు. ఈ నెల సుద్దపల్లిలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని మమతను అభినందిస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి స్కూల్‌కు మంచి పేరు తేవాలని ఆయన తెలిపారు.

Read More »

21న కార్మిక సంఘాల జిల్లా సదస్సు

ఆర్మూర్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2020 జనవరి 8వ తేదీన జాతీయ సమ్మెకు కార్మిక సంఘాల జేఏసీ పిలుపునివ్వడం జరిగిందని కార్మికసంఘాల ప్రతినిధులు తెలిపారు. జాతీయ సమ్మెను జయప్రదం చేయటానికి సన్నాహక సదస్సులు డిసెంబర్‌ 21 తేదీన నిజామాబాద్‌ ప్రెస్‌ క్లబ్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఐఎఫ్‌టియు, సిఐటియు, ఏఐటియుసి కార్మిక సంఘాల నాయకులు ఆర్మూర్‌ పట్టణం కుమార్‌ నారాయణ భవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ...

Read More »

వివాహ నమోదు వల్ల చట్టబద్ధత

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివాహం చేసుకున్నవారు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఆ పెళ్ళికి చట్టబద్ధత లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో వివాహ చట్టం 2002 కు సంబంధించి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివాహం చేసుకునేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తద్వారా దానికి చట్టబద్ధత లభిస్తుందని తెలిపారు. చట్టాన్ని 2002 లో తీసుకువచ్చారని దానికి 2006 లో గవర్నర్‌ ఆమోదం లభించి చట్టబద్ధత ఏర్పడిందన్నారు. చట్టం ...

Read More »