Breaking News

Daily Archives: December 19, 2019

విద్యార్థిని వేదిస్తున్న యువకులపై కేసు నమోదు

రెంజల్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు దిశ ఘటన అనంతరం ప్రభుత్వాలు కఠిన చట్టాలు రూపొందిస్తున్నా ఆకతాయిలలో ఎలాంటి మార్పు రావడం లేదు. రెంజల్‌ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థిని రెండు రోజులుగా బూతు మాటలతో, చేష్టలతో వేధిస్తున్న పోకిరిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని కందకుర్తి గ్రామానికి చెందిన విద్యార్థిని బోధన్‌లోని ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతుంది. మంగళవారం కాలేజ్‌ నుండి ఇంటికి తిరిగి ...

Read More »

విద్యార్థికి సన్మానం

రెంజల్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన వీరన్న గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి నాగనాథ్‌ను గురువారం సర్పంచ్‌ బైండ్ల రాజు, ఎంఈఓ గణేష్‌ రావు ఘనంగా సన్మానించారు. ఈనెల 18 న మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన అండర్‌ 14 విభాగంలో లాంగ్‌ జంప్‌ లో రాష్టస్థ్రాయిలో బంగారు పథకం సాధించడంతో ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజగోపాల్‌, కార్తిక్‌, రాజు, గోదావరి, వాణి తదితరులు పాల్గొన్నారు.

Read More »

దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పథకాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్‌కు చెందిన అధికారులు జిల్లాలో 10 వారాల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పరిశీలనకై వచ్చిన సందర్భంగా వారు జిల్లా కలెక్టర్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ చాంబర్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వారితో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో ప్రాధాన్యత ...

Read More »

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ నిర్వహించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు హెచ్చరించారు. గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లాస్థాయి గర్భస్థ లింగ నిర్ధారణ కమిటీ (పిసి పిఎన్‌డిటి) సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ పురుషుల కంటే స్త్రీల నిష్పత్తి అధికంగా ఉన్న చోట పరీక్షలు జరుగుతున్నాయని అదష్టవశాత్తు మన జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తిలో పెద్దగా తేడా లేదని ...

Read More »

అన్ని మతాలకు సమాన గౌరవం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు టీఎన్జీవోస్‌ యూనియన్‌ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. టీఎన్జీవోస్‌ ఆధ్యర్యంలో గురువారం టీఎన్జీవోస్‌ భవన్‌లో క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ, మానవజాతి ఉద్ధరణకు ఎందరో మహా పురుషులు జన్మించారని వారిలో క్రీస్తు కూడా ఒకరని తెలిపారు. ఎవరైతే సమాజం కోసం పనిచేశారో వారు మానవత్వం కోసం జీవించినట్లు భావించాలని ...

Read More »

పౌరసత్వ చట్టం సవరణకు వ్యతిరేకంగా ధర్నా

ఆర్మూర్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీల పిలుపు మేరకు గురువారం ఆర్మూర్‌ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఆర్డీవో శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు ముత్తన్న, దాసు సూర్య శివాజీ, సిపిఎం నాయకులు గంగాధర్‌ అప్ప, వెంకటేష్‌, ఎల్లయ్య, మార్కస్‌ కమిటీ సభ్యులు సయ్యద్‌ షబ్బీర్‌, అబ్దుల్‌ సత్తార్‌, అబ్దుల్‌ అజీం, కబీర్‌, సాహెబ్‌ కబీర్‌, సాహెబ్‌, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read More »

భవిత కేంద్రాన్ని సందర్శించిన బిఇడి విద్యార్థులు

రెంజల్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం సాటాపూర్‌లోని భవిత కేంద్రాన్ని గురువారం క్షేత్ర పర్యటనలో భాగంగా థామస్‌ బీఈడీ కళాశాలలో శిక్షణ పొందుతున్న 24 మంది విద్యార్థులు సందర్శించారు. భవిత పాఠశాలల్లో వివిధ రకాల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఏ విధమైనటువంటి విద్యను అందిస్తున్నారో పిల్లలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర పర్యటన ద్వారా శిక్షణ పొందుతున్న విద్యార్థులు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందడంతోపాటు, ఇలాంటి సేవలు, విద్యను బోధించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, కష్టాన్ని ...

Read More »

జాతీయ స్థాయి కరాటే పోటీలకు విఘ్నేష్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి నార్త్‌ జోనల్‌ గేమ్స్‌ కరాటే పోటీలలో నిజామాబాదులోని ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల ఏడవ తరగతి విద్యార్థి ఎం.జి.విఘ్నేష్‌ బంగారు పతకాన్ని సాదించారు. ఈ నెల 28, 29 తేదీలలో పుణేలో జరగబోయే జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొనేందుకు విఘ్నేష్‌ అర్హత సాధించాడు. ఈ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల కరస్పాండెంట్‌ మామిడాల మోహన్‌, ఇన్చార్జి గంగాధర్‌, హెచ్‌.ఎం శ్రీశైలం విఘ్నేష్‌ను అభినందించారు.

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఎడపల్లి ఆద్వర్యంలో గురువారం ఎడపల్లి మండలంలోని నయాబాదిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో నేత్ర వైద్యులు దయాకర్‌, శ్వేతలు 50 మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి మోతిబిందు ఉన్నట్లు గుర్తించి వారిని శస్త్రచికిత్స నిమిత్తం లయన్స్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. ఎడపల్లి క్లబ్‌ అధ్యక్షుడు జె.వెంకట్‌ రెడ్డి, ప్రతినిధులు గంగారెడ్డి, మనోజ్‌, మెర్సి, గోపాలకష్ణ పాల్గొన్నారు.

Read More »

దేశ్‌పాండే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యువతకు శిక్షణ

నందిపేట్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని వెల్మల్‌ గ్రామంలోని యువతకు దేశ్‌ పాండే ఫౌండేషన్‌ వారు అద్భుతమైన అవకాశాన్ని కల్పించనున్నారు. దేశ్‌ పాండే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యువకులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ మరియు స్వయం ఉపాధి అవకాశాలు (సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌) నేర్పించనున్నారని నందిపేట్‌ ఎంఇవో శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 21న ఉదయం 10 గంటలకు వెల్మల్‌ ఉన్నత పాఠశాలలో కార్యక్రమ వివరాలు మరియు స్వయం ఉపాధి అవకాశాల గురించి సమావేశం నిర్వహించనున్నారు. గ్రామంలోని యువత అవకాశాన్ని ...

Read More »

ఖలీమ్‌ కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల హత్యకు గురైన భీంగల్‌ మండల తెరాస మైనారిటీ నాయకుడు, మాజీ వార్డు మెంబర్‌ ఖలీమ్‌ కుటుంభ సభ్యులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి గురువారం పరామర్శించారు. ఖలీం హత్య తనను చాలా బాధ కలిగిస్తుందని మంత్రి అన్నారు. భీంగల్‌ పట్టణం ఒక నిస్వార్థపరుడైన నాయకున్ని కోల్పోయిందని పేర్కొన్నారు. ఖలీం కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని, అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటామని చెప్పారు.

Read More »

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ప్రజల్లో అభద్రతా భావం పెంచుతుంది

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌరసత్వ చట్ట సవరణ బిల్లు – 2019 ను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిజామాబాదు కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐఎం (ఎల్‌) జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి మాట్లాడుతూ పౌరసత్వ చట్ట సవరణ బిల్లు దేశ ప్రజల మధ్య విద్వేషాలు, అభద్రతా భావం పెంచుతుందన్నారు. వామపక్ష ప్రజాసంఘాల నేతలు సుధాకర్‌, కంజర్‌ భూమయ్య, వనమాల కష్ణ, రమేష్‌ ...

Read More »

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రి, మెడికల్‌ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ప్రభుత్వాసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెండింగ్‌లో ఉండడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెండింగ్‌ వేతనాలివ్వడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read More »

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఎంఆర్‌సి బిల్లు, క్యాబ్‌ బిల్లు రద్దు చేయాలని, దేశ సమగ్రతకు సెక్యులరిజంకి భంగం వాటిల్లే బిల్లు వల్ల అన్నదమ్ములుగా కలిసి ఉంటున్న హిందూ ముస్లింల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదముందని, అందుకోసం బిల్లును తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ముందు మెయిన్‌ రోడ్డుపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ...

Read More »