Breaking News

Daily Archives: December 20, 2019

జనవరి 2 నుండి పల్లె ప్రగతికి సిద్ధం కండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 2 నుండి ప్రారంభమయ్యే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు ముందస్తుగా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్‌, ఎంపీడీవోలు, డిఆర్‌డిఓ, అధికారులు, జిల్లా పరిషత్‌ అధికారులతో పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గతంలో నెల రోజుల పాటు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం ప్రజా ...

Read More »

భారతీయుల మధ్య చిచ్చుపెట్టే విధానాలు విడనాడాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఆర్‌సి పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ, ముస్లిం నాయకులు, సిపిఐ సిపిఎం, వివిధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం వరకు ముస్లింలు కామారెడ్డి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దారి పొడుగునా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు ...

Read More »

బిజెపి కామారెడ్డి రూరల్‌ నూతన కమిటీ

డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ కామారెడ్డి రూరల్‌ మండల అధ్యక్షుడు దుమాల నరేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల ఉపాధ్యక్షులుగా ఆనంద్‌ రావు, అంజాగౌడ్‌, జనరల్‌ సెక్రెటరీలుగా నవీన్‌ గౌడ్‌, శ్రీధర్‌, సెక్రెటరీలుగా బాణోత్‌ రాజు నాయక్‌, అంగోత్‌ రాజు నాయక్‌, గోవర్ధన్‌, రాజేందర్‌, బిజెవైఎం మండల అధ్యక్షుడుగా వెంకట స్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల బూత్‌ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

శనివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పట్టణ విద్యుత్‌ వినియోగదారులకు విద్యుత్‌శాఖ సూచన. 21వ తేదీ శనివారం విద్యుత్‌ ఉపకేంద్రాల వద్ద నెలవారి మరమ్మతులు చేస్తున్నందున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Read More »

ఎరువుల దుకాణం తనిఖీ

రెంజల్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌లో ఎరువుల దుకాణాన్ని శుక్రవారం బోధన్‌ ఏడిఏ సంతోష్‌ తనిఖీ చేశారు. షాపులోని రికార్డులు పరిశీలించారు. రైతులకు ఎరువులు విక్రయిస్తే ఆధార్‌ కార్డుతోపాటు, రైతు పట్టాదారు పాసు బుక్‌ జిరాక్స్‌ తీసుకొని ఎరువులను విక్రయించాలని డీలర్‌కు సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్‌ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు మౌలానా ఉన్నారు.

Read More »

రైతు భీమా చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటా పూర్‌ గ్రామానికి చెందిన రైతు దెబ్బడి గంగవ్వ మతి చెందగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైనా 5 లక్షల రూపాయల రైతు బీమా చెక్కును శుక్రవారం సర్పంచ్‌ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్‌ పాషా, ఏడిఏ సంతోష్‌ చేతుల మీద కుటుంబ సభ్యులు రాజుకు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి లాక్ష్మీకాంత్‌ రెడ్డి, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, టిఆర్‌ఎస్‌ నాయకులు కుర్మె సాయిలు, చంద్రం తదితరులు పాల్గొన్నారు.

Read More »

22న హిందూ ధర్మ వైభవ ప్రచార మహాపాదయాత్ర

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఈ నెల 22 నుండి హిందూ ధర్మ వైభవ ప్రచార మహాపాదయాత్ర నిర్వహిస్తున్నామని సంజీవని హనుమాన్‌ ఆశ్రమ వ్యవస్థాపకుడు సురేష్‌ ఆత్మ మహారాజ్‌ అన్నారు. నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహా పాదయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. నిజామాబాద్‌ ఖిల్లా రఘునాథ ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభమవుతుందని, 9 ఆలయాల గుండా నీలకంఠేశ్వరాలయానికి చేరుకుంటుందన్నారు. పాదయాత్రలో యువకులు, పెద్దలు పాల్గొని ...

Read More »

22న అయ్యప్ప కటాక్షం సినిమా ఉచిత ప్రదర్శన

బాన్సువాడ, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయ్యప్ప దీక్ష ధరించిన స్వాముల కోసం డిసెంబర్‌ 22న బాన్సువాడ పట్టణంలోని మహేశ్వరి థియేటర్‌లో ఉదయం 8 గంటలకు అయ్యప్ప కటాక్షం అనే సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు థియేటర్‌ యజమాని నార్ల రత్న కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దీక్ష ధరించిన స్వాములకు ఉచితంగా సినిమా ప్రదర్శనను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అయ్యప్ప స్వాములు, జర్నలిస్టు మిత్రులు సినిమాను చూసేందుకు రావాలని రత్న కుమార్‌ ...

Read More »

పొరపాట్లసవరణకై అవకాశంకల్పించాలి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఎఫ్‌ నంబర్‌ నమోదు సందర్భంగా జరిగిన పొరపాట్లను ఆధార్‌ కార్డులో వయసు తదితర తప్పొప్పులను సవరించడానికి ఒక్క సంవత్సరం అవకాశం కల్పించాలని జక్రాన్‌ పల్లి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి, స్థానిక తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో గల బీడీ కార్మికుల పిఎఫ్‌ నంబర్‌కు (కేవైసీ) ఆధార్‌ అనుసంధానంలో ఎదురైన పుట్టిన తేదీల సమస్యను పరిష్కరించాలని లేనిచో అనేక మంది ...

Read More »

మానవ జీవితానికి సార్థకత సేవయే

కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డికి చెందిన గాలి భూమయ్యకు ఆపరేషన్‌ నిమిత్తం ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. 58వ సారి శుక్రవారం ఉదయం వి.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో బాలు రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ గడచిన 15 సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లాతో పాటు మెదక్‌ జిల్లా నిజామాబాద్‌ సిరిసిల్ల హైదరాబాద్‌ వివిధ ప్రాంతాలకు ...

Read More »

ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు పరచాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బిఎల్‌ఎఫ్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్‌ఎఫ్‌ నాయకులు వెంకట్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశ పెట్టిందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కుల వివక్షత లేకుండా మహిళలపై జరుగుతున్న ...

Read More »

రజక సంఘం ఆద్వర్యంలో గాడ్గేబాబా వర్ధంతి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సంత్‌ గాడ్గే బాబా 63వ వర్ధంతి నిర్వహించారు. ఆర్మూర్‌ పట్టణం ధోబిగల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆశన్నగారి రాజేశ్వర్‌ రెడ్డి పాల్గొని గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ పట్టణ రజక సంఘం అధ్యక్షులు చౌదరి చిన్నయ్య, పత్తేపురం శంకర్‌, దమన స్వామి, శంకర, చౌదరి రమేష్‌, మీరా శ్రావణ్‌, గంజల గంగాధర్‌, చేగంటి విజయ్‌, దేగం విట్టల్‌, మీరా ...

Read More »