Breaking News

22న అయ్యప్ప కటాక్షం సినిమా ఉచిత ప్రదర్శన

బాన్సువాడ, డిసెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయ్యప్ప దీక్ష ధరించిన స్వాముల కోసం డిసెంబర్‌ 22న బాన్సువాడ పట్టణంలోని మహేశ్వరి థియేటర్‌లో ఉదయం 8 గంటలకు అయ్యప్ప కటాక్షం అనే సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు థియేటర్‌ యజమాని నార్ల రత్న కుమార్‌ తెలిపారు.

ప్రస్తుతం అయ్యప్ప దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దీక్ష ధరించిన స్వాములకు ఉచితంగా సినిమా ప్రదర్శనను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అయ్యప్ప స్వాములు, జర్నలిస్టు మిత్రులు సినిమాను చూసేందుకు రావాలని రత్న కుమార్‌ ఆహ్వానించారు.

Check Also

పోచారం ట్రస్టు ఆధ్వర్యంలో బియ్యం, నిత్యవసర సరుకుల‌ పంపిణీ

బాన్సువాడ, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి నివారణకు విధించిన లాక్‌ డౌన్‌ నేపధ్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *