Breaking News

ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు పరచాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బిఎల్‌ఎఫ్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్‌ఎఫ్‌ నాయకులు వెంకట్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశ పెట్టిందన్నారు.

వెంటనే కేంద్ర ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కుల వివక్షత లేకుండా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు అమలుచేయాలని కోరారు. అత్యాచార ఘటన జరిగి నెలలు గడుస్తున్నా బాధితులకు న్యాయం చేయలేక పోతుందని వాపోయారు. వెంటనే ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు పరచాలని డిమాండ్‌ చేశారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *