Breaking News

Daily Archives: December 21, 2019

పంచాయతీ కార్మికుల క్యాలెండర్‌ ఆవిష్కరణ

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో పంచాయతి కార్మికుల క్యాలెండర్‌ను ఎంపీపీ అశోక్‌ పటేల్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు కూలీ సంఘం నాయకులు సురేష్‌, మాజీ జెడ్పిటిసి సాయిరాం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజ్‌ పటేల్‌ తదితరులు ఉన్నారు.

Read More »

కెసిఆర్‌తోనే గ్రామాల అభివద్ధి

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం కేసీఆర్‌తోనే గ్రామాల అభివద్ధి జరుగుతుందని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌ మండలంలోని శేరి తండాలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికి, పూలమాల, శాలువాతో సత్కరించారు. అనంతరం సిసి రోడ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి వీధికి సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, ...

Read More »

గణితం అంటే భయం వద్దు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పెర్కిట్‌ లోని విజ్ఞాన్‌ భారతి పాఠశాలలో శనివారం విశ్వతేజస్‌ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేదిక్‌ మాథ్స్‌ పరీక్ష నిర్వహించి మెడల్స్‌, ప్రశంసా పత్రాలు అందజేశారు. గణితం అంటే భయం వద్దని విశ్వతేజస్‌ సంస్థ డైరెక్టర్‌ ప్రసాద్‌ అన్నారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ నర్సారెడ్డి, సంస్థ సెక్రటరీ నరహరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

ఉదయం వినతి – సాయంత్రం స్థలం కేటాయింపు

ఆర్మూర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఆర్మూర్‌ పట్టణంలో ఉదయం 10 గంటల సమయంలో ఆర్మూర్‌ భజరంగ్‌ యూత్‌ సభ్యులు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని కలిసి గోశాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. కాగా ఇదే రోజు కేవలం 5 గంటల వ్యాధిలో ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో గోశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే వెయ్యి గజాల స్థలాన్ని ఏర్పాటు చేసి గోశాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. కొద్దీ రోజుల్లోనే గోశాల నిర్మాణానికి నిధులు ...

Read More »

మహిళల భద్రతపై అవగాహన

రెంజల్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల భద్రత కోసం నా భద్రత నా పోలీస్‌ అనే అంశాలపై శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎస్‌ఐ శంకర్‌ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అవగాహన కల్పించారు. నేటి సమాజంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు అధికంగా జరుగుతున్నాయని వాటిని నివారించడానికి మహిళలు తీసుకోవలసిన తగు జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. సమాజంలో అధికంగా జరుగుతున్న దాడులు నివారించడానికి కావాల్సిన జాగ్రత్తలు యువకుల పాత్రపై విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ...

Read More »

క్రిస్మస్‌ దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలోని ఎమ్‌ఆర్‌ గార్డెన్‌లో క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆర్మూర్‌ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పియుసి చైర్మన్‌ ఆశన్న గారి జీవన్‌ రెడ్డి హాజరై క్రైస్తవులనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని మతాలను అధికారికంగా పండుగలు జరుపుకోవాలని, క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన క్రిస్మస్‌ సోదర, సోదరీమణులకు గుర్తు చేస్తూ తెలియజేశారు. అలాగే ప్రతి పండుగను హిందూ ...

Read More »

రూ. 8500 వేతనం అమలు చేయాలి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మికులు తమకు రూ.8500 వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేశారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి దాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు 2018 ఆగస్టు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నెలకు 8500 రూపాయలు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. దీనిని అమలు చేయాలని జిఓ ఇచ్చినప్పటికీ అమలు కావడం లేదన్నారు. జిల్లా ...

Read More »

కంటి ఆపరేషన్‌కు మాజీ ఎంపి కవిత సహాయం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షుగర్‌ వ్యాధితో కంటి చూపు కోల్పోయిన విద్యార్థి నందినికి మాజీ ఎంపీ కవిత సొంత డబ్బులతో ఆపరేషన్‌ చేయించటంతో తిరిగి కంటి చూపు వచ్చింది. నందిని శనివారం సొంత గ్రామం మాక్లూర్‌ మండలం ఏలీయా తండాకు రావటంతో జడ్పి చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు ఆమెను పరామర్శించారు. ఈ సందర్బంగా విఠల్‌ రావు మాట్లాడుతూ మాజీ ఎంపీ కవిత మానవతా దక్పధంతో స్పందించి నందినికి చికిత్స చేయించారన్నారు. మధుమేహ వ్యాధితో బాధ ...

Read More »

విద్యార్థులకు ఛత్రంజీల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కస్బాగల్లీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులు కూర్చుని తినటానికి ఛత్రంజీలు అందజేశారు. విద్యార్థులు నేలపై కూర్చుని భోజనం చేయడంతో ధుమ్ము, ధూళి ఉంటుందని, కాబట్టి ఛత్రంజీలు అందజేశామన్నారు. కార్యక్రమంలో శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్‌, కార్యదర్శి యాదగిరి, కోశాధికారి రాంమోహన్‌, బాలశేకర్‌, శ్రీనివాస్‌, నగేష్‌, ప్రసాద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీటిని పంపిణీ చేయడానికి దాతలు టి.శ్రీనివాస్‌, బి.సందీప్‌, బి.నరేశ్‌ సహకరించారని తెలిపారు.

Read More »

సెల్‌ టవర్‌ నుంచి మంటలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని గాజుల పేట్‌లో ఒక నివాస భవనంపై ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌కి శనివారం మధ్యాహ్నం మంటలు అంటుకున్నాయి. దీంతో భవనంలో ఉన్న వారు, చుట్టుపక్కల వారు భయబ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read More »

పదిలో పక్క ప్రణాళిక

నందిపేట్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో పది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 19 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొదటి తరగతి నుండి 9 తరగతుల వరకు ఆడుతూ పడుతూ చదివిన విద్యార్థులు పదవ తరగతిలో బోర్డు ఎక్జామ్‌ ఉండడం వలన ఆట- పాటలను పక్కన పెట్టి చదువుపై శ్రద్ధవహించారు. ప్రతీ విద్యార్థికి పదో తరగతి ఎంతో కీలకం. పదో తరగతిలో సాధించే మార్కులే భవిష్యత్తు ...

Read More »