Breaking News

కంటి ఆపరేషన్‌కు మాజీ ఎంపి కవిత సహాయం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షుగర్‌ వ్యాధితో కంటి చూపు కోల్పోయిన విద్యార్థి నందినికి మాజీ ఎంపీ కవిత సొంత డబ్బులతో ఆపరేషన్‌ చేయించటంతో తిరిగి కంటి చూపు వచ్చింది. నందిని శనివారం సొంత గ్రామం మాక్లూర్‌ మండలం ఏలీయా తండాకు రావటంతో జడ్పి చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు ఆమెను పరామర్శించారు.

ఈ సందర్బంగా విఠల్‌ రావు మాట్లాడుతూ మాజీ ఎంపీ కవిత మానవతా దక్పధంతో స్పందించి నందినికి చికిత్స చేయించారన్నారు. మధుమేహ వ్యాధితో బాధ పడుతూ కంటిచూపునకు ఇబ్బందులు కలిగిందని తెలుసుకొన్న కవిత స్వంత ఖర్చుతో నందినికి కంటి ఆపరేషన్‌ చేయించడం సంతోషకరమన్నారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article