Breaking News

క్రిస్మస్‌ దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, డిసెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలోని ఎమ్‌ఆర్‌ గార్డెన్‌లో క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆర్మూర్‌ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పియుసి చైర్మన్‌ ఆశన్న గారి జీవన్‌ రెడ్డి హాజరై క్రైస్తవులనుద్దేశించి మాట్లాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని మతాలను అధికారికంగా పండుగలు జరుపుకోవాలని, క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన క్రిస్మస్‌ సోదర, సోదరీమణులకు గుర్తు చేస్తూ తెలియజేశారు. అలాగే ప్రతి పండుగను హిందూ ముస్లింలకు క్రైస్తవులకు ప్రతి పండుగను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవించి ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆర్మూర్‌ నియోజకవర్గానికి చేసిన అభివద్ధిని వివరించారు.

రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివద్ధి కొరకు కషి చేస్తానని అన్ని మతాల వర్గాల వారు ఆయనకు సహకరించాలని కోరారు. అదేవిధంగా క్రైస్తవులకు స్మశాన వాటిక కొరకు స్థలం కేటాయించామని, రాష్ట్రంలోని అతిపెద్ద భవనం క్రైస్తవ మతానికి హైదరాబాద్‌లో నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని, క్రైస్తవ సోదర సోదరీమణులు ఆశీర్వదించాలని కోరారు.

అనంతరం క్రిస్మస్‌ దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, నియోజకవర్గ మండలాల తహసీల్దార్లు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీ నరసయ్యతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *