Breaking News

Daily Archives: December 22, 2019

మొదటి విడత స్ఫూర్తిగా పల్లె ప్రగతి పనులు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొదటి విడత స్ఫూర్తిగా రెండవ విడత పల్లె ప్రగతి పని జరగాలని రాష్ట్ర రహదారులు- భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి 2 నుండి పది రోజుల పాటు నిర్వహించబోయే పల్లె ప్రగతి కార్యక్రమంపై ఎంపీపీలకు, జెడ్‌పిటి సిలకు స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ వ్యక్తి కేంద్రంగా, గ్రామం కేంద్రంగా అభివద్ధి ...

Read More »

ప్రేమ, కరుణతోనే మానవాళి మనుగడ

కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రేమ, కరుణ, తోటివారికి సహాయంతోనే మానవాళి మనుగడ సంతోషంగా ఉంటుందని, అదే క్రీస్తు చూపిన మార్గం అని, దానిని ఎప్పుడు విడనాడవద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ అన్నారు. శనివారం రాత్రి స్థానిక ఈ.ఎస్‌.ఐ. వెస్లీ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకలలో జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. వేడుకలో జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకటేష్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఫాదర్‌ ...

Read More »

చేతి సంచుల పంపిణీ

కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ మంత్రి, మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ కామారెడ్డి పట్టణ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించారు. అదేవిధంగి చేతి సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్‌తో పర్యావరణం చెడిపోతుందని, దయచేసి అందరూ ప్లాస్టిక్‌ను బహిష్కరించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఫిరంగి రాజేశ్వర్‌, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు సందీప్‌, ...

Read More »

పాండురంగ శర్మ కుటుంబాన్ని పరామర్శించిన షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ మంత్రి, మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ కామారెడ్డి పట్టణానికి చెందిన పాండురంగ శర్మ మరణించడంతో వారి ఇంటికి వెళ్లి కుమారులకు సానుభూతి తెలిపారు. షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ పాండురంగ శర్మ మంచి వ్యాఖ్యాత అని, ఉమ్మడి జిల్లాలలో వ్యాఖ్యాత సామ్రాట్‌గా పేరు గాంచారన్నారు. వారు తనకు విద్య బోధించారని, వారితో గురుశిష్యుల అనుబంధం ఉండేదని షబ్బీర్‌ గుర్తు చేసుకున్నారు. పాండురంగ శర్మ పేరు కలకాలం గుర్తుండేలా ...

Read More »

రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు

కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఏఏకి మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయవాదులు మున్సిపల్‌ కార్యాలయం ముందున్న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం శాంతి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుకు వచ్చిన సిఏఏకు ప్రతి భారత పౌరుడు మద్దతు తెలపాలని, చట్టం ద్వారా ఏ ఒక్క మతానికి చెందిన వారికి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు కావాలని రాజకీయ స్వప్రయోజనాల కోసం మతాల ...

Read More »

28 నుండి తెలంగాణ ఫుట్‌బాల్‌ ఉమెన్స్‌ ప్రొఫెషనల్‌ లీగ్‌ టోర్నమెంట్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉమెన్స్‌ ప్రొఫెషనల్‌ లీగ్‌ క్లబ్బులను తెలంగాణ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి పాల్గుణ ప్రకటించారు. ఈనెల 28 నుండి ప్రారంభం కానున్న ప్రథమ తెలంగాణ ఉమెన్స్‌ ప్రొఫెషనల్‌ లీగ్‌ క్లబ్బుల యజమానులకు జెర్సీలను అందజేసి లోగోని ఆవిష్కరించారు. అదే విధంగా టోర్నమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శిగా నరాల సుధాకర్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ప్రముఖ న్యాయవాది, భాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి, నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఖలీల్‌లను ...

Read More »

పద్మశాలీలు మునిసిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పద్మశాలీలు ఐక్యంగా ఉండి అన్ని రంగాలలో ఎదగాలని బాల్కొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఈరవత్రి అనిల్‌ పిలుపునిచ్చారు. డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ శివారులోని ఓ ఫాం హౌజ్‌లో ఆదివారం నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి అనిల్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఐక్యంగా ఉంటే హక్కులు సాదించుకోవచ్చన్నారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికలలో సత్తా చాటాలని సూచించారు. పద్మశాలీలు రాజకీయ రంగంలో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ...

Read More »

గణిత మూలాలను లోతుగా నేర్చుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తార్కికంగా ఆలోచించడమే గణితం అని జిల్లా గణిత ఫోరమ్‌ కార్యదర్శి కష్ణ అన్నారు. వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని మోపాల్‌ మండలం కంజర్‌ సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి కష్ణ వక్తగా హాజరై మాట్లాడుతూ గణితం అంటే భయం వద్దని గణిత మూలాలను లోతుగా నేర్చుకోవాలని అన్నారు. రామానుజన్‌ గణితం పట్ల చేసిన కషిని విద్యార్థులకు వివరించారు. నిత్య జీవితంలో గణితం ...

Read More »

సిఎం సహాయనిధి అందజేత

నందిపేట్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందిపేట్‌కి చెందిన మహమ్మద్‌ అలిముద్దీన్‌కి సీఎం సహాయ నిధి (ఎల్‌వోసి -లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) డెభై ఐదు వేల రూపాయలు సంబంధిత చెక్కుని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. హైదరాబాద్‌లోని రైన్‌ బో చిల్డ్రన్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందిపేట్‌ మండలం ఐలాపూర్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సుదర్శన్‌ మనుమరాలు అన్వికకి సీఎం సహాయ నిధి (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) లక్ష రూపాయలు ...

Read More »

ఆర్యవైశ్య సంఘం కమిటీ ఏకగ్రీవం

కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం అశోక్‌ నగర్‌ కాలనీ ఆర్యవైశ్య సంఘ సమావేశం నిర్వహించారు. ఇందులో అశోక్‌ నగర్‌ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా విశ్వనాధుల మహేష్‌ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా వల్లిపిశెట్టి లక్ష్మణ్‌ గుప్త, కోశాధికారిగా నగునూరి పండరినాథ్‌ గుప్తా, ఉపాధ్యక్షుడుగా అల్లాడి నరసయ్య గుప్తా, బెజ్జిగేమ్‌ సుధాకర్‌ గుప్తా, సహాయ కార్యదర్శిగా కొట్టూరు సూర్య ప్రకాష్‌ గుప్తా, గందె శ్రీ రాముల గుప్తా, ముఖ్య సలహాదారుడిగా మొలుగు కష్ణమూర్తి గుప్త, పందిరి లక్ష్మి గుప్తాలను ...

Read More »

చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ ఆద్వర్యంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ డైమండ్‌ సహకారంతో ఆదివారం మాక్లూర్‌ మండలం ఒడ్యాట్‌ పల్లి గ్రామంలో ఉచిత పిల్లల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల వైద్యులు యెర్ర శరత్‌ చంద్ర 192 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్హహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇందూర్‌ చిల్డ్రన్‌ హాస్పిటల్‌ నిర్వాహకులు తిరుమల నాయుడు, సర్పంచ్‌ శ్రీసుద రాజేశ్వర్‌, చింతల మోహన్‌, లయన్స్‌ అధ్యక్షుడు హర్దీప్‌ సింగ్‌, ...

Read More »

నేటి నుంచి మల్లికార్జున స్వామి ఉత్సవాలు

కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22వ తేదీ ఆదివారం నుంచి సోమవారం వరకు రెండురోజుల పాటు శ్రీ మల్లికార్జున స్వామివారి ఉత్సవాలు, జాతర నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం స్వామి వారికి మైలాలు, ఆదివారం స్వామి వారికి పట్నాలు, ముడుపులు మొక్కులు చెల్లించడం జరుగుతుందన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్‌ల ప్రదర్శన ఉంటుందన్నారు. సోమవారం స్వామి వారి చక్కెర తీర్థం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కామారెడ్డి జిల్లా ...

Read More »

కొత్త జిపిలకు కొత్త భవనాలు ఎప్పుడో?

నందిపేట్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం మార్చ్‌ 2018 లో చిన్న గ్రామాలను, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజలకు పాలనా సౌలభ్యం చేకూర్చింది. దాంతో పాటు ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండాలనే ఉద్దేశంతో నియామకాలు కూడా చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి గ్రామ మొదటి సర్పంచ్‌లుగా ఎన్నికై గ్రామ సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాల అభివద్ధికి క షి చేస్తున్నారు. అయితే కొత్త పంచాయతీలకు శాశ్వత భవనాలు నిర్మించడం మాత్రం ప్రభుత్వం మర్చిపోయింది. ...

Read More »