Breaking News

Daily Archives: December 23, 2019

ఆర్‌డివో కార్యాలయం ముందు ధర్నా

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారత రైతు సమాఖ్య మరియు యు.ఎ సిపిఐ యు పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కామారెడ్డి ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్‌డిఓకు వినతి పత్రం అందజేసినట్లు రైతు సమాఖ్య జిల్లా కన్వీనర్‌ పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వర్గానికి అమలవుతున్న మాదిరి రైతులకు వేతనాలు, పెన్షన్లు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పెట్టుబడి అదనంగా, 50 శాతం గిట్టుబాటు ధర కోసం ...

Read More »

మునిసిపల్‌ ఎన్నికల నగారా మోగింది

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చేనెల జనవరి 7వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. కాగా 8 వ తేదీ నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 12, 13 తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పిస్తారు. 14 న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది, అలాగే 22న పోలింగ్‌ నిర్వహిస్తారు. 25న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా మునిసిపల్‌ ఎన్నికల నగారా మోగడంతో ఆయా ...

Read More »

క్రిస్మస్‌ దుస్తుల పంపిణీ

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్మస్‌ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవిఎస్‌ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రైస్తవులకు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని మతాలు సమానమేనని, ముస్లింలకు రంజాన్‌ పండగకు, క్రైస్తవులకు క్రిస్మస్‌ పండగకు, హిందువులకు బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమాన్ని ఒక వైపు, మరోవైపు అభివద్ధిని ముందుకు ...

Read More »

తెలంగాణలో 90 శాతం కార్మికులు శ్రామిక బహుజనులే

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మిక వర్గం హక్కులకోసమే కాకుండా రాజకీయ అధికారంకోసం కూడా ఉద్యమించాలని బహుజన లెఫ్ట్‌ కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ దండి వెంకట్‌ పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఫూలే-అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో జరిగిన తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో వెంకట్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలే బీడీ పరిశ్రమ సంక్షోభానికి కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 90 ...

Read More »

28 నుంచి పిజి సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాంగణం, దక్షిణ ప్రాంగణం, అన్ని అనుబంధ కళాశాలల్లోని పిజి కోర్సులలోని ఎంఎ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యు, ఎంసిఎ, ఎంబిఎ, ఐఎమ్‌బిఎలలో గల 3వ, 5వ, 9వ సెమిస్టర్లకు రెగ్యులర్‌ పరీక్షలు ఈనెల 28వ తేదీనుండి ప్రారంభం కానున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.

Read More »

మోబైల్‌ వెబ్‌సైట్ల నుంచి విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరికొండ మండలం కొండూరులో సోమవారం ఎన్‌పిడిసిఎల్‌ ఆపరేషన్‌ సర్కిల్‌ నిజామాబాద్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌ బిల్లుల చెల్లింపులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో శ్రీనివాస్‌ నాయక్‌ మాట్లాడుతూ విద్యుత్‌ బిల్లులను ఎప్పుడైనా ఎక్కడైనా మొబైల్‌ వెబ్‌ సైట్ల నుండి చెల్లించవచ్చని, అలాగే పే ఆన్‌లైన్‌, పేటీఎం, టీ వాలెట్‌, ఫోన్‌ పే ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు. కార్యక్రమంలో సిరికొండ మండలం ఏఈ శ్రీధర్‌, లైన్‌ మెన్‌ నాగరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Read More »

పట్టణ బిజెపి అధ్యక్షుడుగా జెస్సు అనిల్‌

ఆర్మూర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా జెస్సు అనిల్‌ ఎన్నికయ్యారు. పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఆకుల రాజు, పట్టణ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడుగా పాలెపు రాజు, పట్టణ యువ మోర్చా అధ్యక్షుడుగా కలిగోట్‌ ప్రశాంత్‌లు ఎన్నికైనందుకు పల్లె గంగారెడ్డి వీరిని శాలువాలతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. కార్యక్రమంలో పుప్పాల శివరాజ్‌, నుతుల శ్రీనివాస్‌ రెడ్డి, పోల్కం వేణు, ప్రతాప్‌, బొట్ల విజయ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

ఉససర్పంచుల సమస్యలు పరిష్కరించాలి

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఉప్పసర్పంచుల సంఘం అధ్యక్షులు రాములు నాయక్‌ గారి ఆదేశాల మేరకు ముగ్గురు ఉప్పసర్పంచులకు మండల సర్వసభ్య సమావేశంలో స్థానం కల్పించాలని, కనీస గౌరవ వేతనం ఇవ్వాలని, గ్రామాల్లో చేపట్టే అభివద్ధి పనుల శిలాఫలకాలపై ఉప్పసర్పంచుల పేర్లు ముద్రించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు గొనె శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శి వినోద రాజాగౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షులు శివప్రసాద్‌, దావీదు, మాచాపూర్‌ ఉప సర్పంచ్‌ ...

Read More »

మునిసిపాలిటీలో జరిగిన అవినీతిని వదిలిపెట్టేది లేదు

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, సామాన్య ప్రజలకు అధికారుల సాయం అందడం లేదని, డబ్బులిస్తేనే పనులు జరుగుతున్నాయని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకుల భజన చేస్తున్న అధికారులు లక్షలాది రూపాయలు దోచుకుతిన్నారని, ప్రతి పనిలో అవినీతి అధికారులు చేయివాటం ప్రదర్శిస్తున్నారన్నారు. ...

Read More »

స్టడీ టూర్‌లో విజయవాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సందర్శన

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలక వర్గ సభ్యులు స్టడీ టూర్‌లో భాగంగా విజయవాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డును సందర్శించారు. మార్కెట్‌ కమిటీ సూపర్‌ వైజర్‌ వేంకటేశ్వర రావును కలిసి విజయవాడ మార్కెట్‌ కమిటీ గురించి తెలుసుకున్నారు. స్టడీ టూర్‌లో కామారెడ్డి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గట్టగోని గొపిగౌడ్‌, వైస్‌ ఛైర్మన్‌ గౌరి శంకర్‌, డైరెక్టర్లు గెరిగంటి లక్ష్మినారాయణ ముదిరాజ్‌, బొంబొతుల రాజాగౌడ్‌, షేక్‌ అజీజ్‌, బైండ్ల లక్ష్మీనారాయణ, గంగుల ...

Read More »

రైతులేని సమాజాన్ని ఊహించలేము

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్ని కష్ణ దేశీ విత్తన పరిరక్షణ సమితి ఆద్వర్యంలో సోమవారం నిజామాబాద్‌ నగరంలోని ఎన్‌.డి.సి.సి.బి కార్యాలయ ఆవరణలో జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌, డిసిసిబి చైర్మన్‌ గంగాధర్‌ పట్వారి, ఆదర్శ రైతు చిన్ని కష్ణుడు, పర్యావరణ వేత్త రావుట్ల జనార్థన్‌ పాల్గొన్నారు.

Read More »

రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని నిజాంపేట్‌ గ్రామం నుండి నారాయణఖేడ్‌ పట్టణం వరకు గల 14.4 కిలో మీటర్ల గల రహదారి పూర్తి మరమ్మతు పనులకు ఐదు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. మరమ్మతు పనులను నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి సోమవారం ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో క షి చేస్తున్నారన్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు రహదారులన్నీ సుందరంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ 30 రోజుల ప్రణాళికలో ...

Read More »