Breaking News

Daily Archives: December 24, 2019

ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత

డివిజన్లో ఆర్డీవోలే నోడల్‌ అధికారులు బాధ్యులు అనధికారిక గైర్హాజర్‌ కు చర్యలు, సెలవుల్లో ఇబ్బంది పెట్టను ప్రజావాణి సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం ఉదయం క్షేత్ర పర్యటన, సాయంత్రం సమావేశాలు అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లు సమకూర్చాలి క్రిస్మస్‌ శుభాకాంక్షలు నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పల్లె ప్రగతి నూటికి నూరు శాతం పనులు పూర్తి చేయడానికి అధికారులు క షిచేయాలని, డివిజన్‌ స్థాయిలో డివిజనల్‌ అధికారులు నోడల్‌ అధికారిగా డివిజన్‌కు పూర్తి బాధ్యులుగా ...

Read More »

జనవరి 5న సావిత్రిబాయి ఫూలే 189వ జయంతి ఉత్సవాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చదువుల తల్లి భారతదేశంలోని మొట్టమొదటి మహిళ విద్యావంతురాలు సావిత్రిబాయి పూలే 189 జయంతి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మోహన్‌, రామ్‌ చందర్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ లోవర్‌ ట్యాంక్‌ బండ్‌ కవాడిగూడలోని ఆర్‌ కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌లో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సాంఘిక ...

Read More »

యంత్రాలతో వరినాట్ల ప్రదర్శన

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కిసాన్‌మేళాలో భాగంగా బొప్పాస్‌పల్లిలోని రాష్ట్ర విత్తనోత్పత్తి కేంద్రంలో మంగళవారం యంత్రంతో వరినాటే ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డిలు కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరుకు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త వెంకటయ్య, రిలయన్స్‌ ఫౌండేషన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ సంబంధిత శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్ళను సందర్శించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి నాగేంద్రయ్య తదితరులున్నారు.

Read More »

బాన్సువాడలో సిఏబి, ఎన్‌ఆర్‌సికి మద్దతుగా ర్యాలీ

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలో మంగళవారం హిందూ ధార్మిక సంఘాల ఆద్వర్యంలో సిఏబి, ఎన్‌ఆర్‌సికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అప్ఘనిస్తాన్‌ లాంటి దేశాల నుంచి చొరబాటుదారులు అక్రమంగా దేశంలోకి వచ్చి ఉంటున్నారని, వారిని వెనక్కి పంపి, ఆ దేశాల్లో మైనార్టీలుగా బతుకుతూ మనదేశానికి పౌరులుగా వచ్చిన వారికి ఇక్కడ పౌరసత్వం కల్పించేందుకే ఎన్‌ఆర్‌సి, క్యాబ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. దీనికి దేశంలోని ముస్లింలకు ...

Read More »

స్కూలు బస్సు బోల్తా – విద్యార్థులకు గాయాలు

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు చైతన్య పాఠశాలకు చెందిన బస్సు మంగళవారం పెద్దమల్లారెడ్డి వద్ద బోల్తాపడింది. మూలమలుపు వద్ద వేగంగా వెళుతున్న క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్ళి పడిపోయింది. ప్రమాదంలో బస్సులోని 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి గ్రామస్తులు చేరుకొని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

Read More »

గ్రామ పంచాయతీలను పరిపుష్టి చేయడమే ప్రధాన లక్ష్యం

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీలను పరిపుష్టి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం భిక్కనూరు మండలం తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌లో పల్లె ప్రగతి అవగాహన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పల్లె బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో వార్డు మెంబర్ల నుంచి రాష్ట్ర మంత్రి స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో ...

Read More »

ఉచిత వైద్య శిబిరం

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిటీ న్యూరో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, లయన్స్‌ క్లబ్‌ కామారెడ్డి, హిందూ యూత్‌ వారి ఆధ్వర్యంలో మంగళవారం టేక్రియాల్‌ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో డాక్టర్‌. సంతోష్‌ కుమార్‌ పెండ్యాల వీణ. నరాల వైద్య నిపుణులు పాల్గొని దాదాపు 200 మందికి పైగా నరాలు, కంటి సమస్యలతో అవస్థ పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అందుబాటులో ఉన్న మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమాన్ని విజయ ...

Read More »

ప్రేమ అనే దీపం వెలిగించి పదిమందికి వెలుతురు పంచాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్మస్‌ పండుగ సందర్భంగా నిజామాబాదు పోలీసు కమీషనర్‌ కార్తికేయ శుభాకాంక్షలు తెలిపారు. ఈర్ష్య, ద్వేషం, అసూయలతో కూడిన చీకట్లను పారద్రోలి ప్రేమ అనే దీపం వెలిగించి పది మందికి వెలుతురునివ్వాలని ఆయన ఆకాంక్షించారు. క్రైస్తవులందరు వారి కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు, పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా, సోదరభావంతో మెలగాలని పేర్కొన్నారు.

Read More »

సహకరించిన ప్రతి ఒక్కరికి కతజ్ఞతలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుమారు రెండు సంవత్సరాల పాటు తను పనిచేసిన కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కతజ్ఞతలు తెలుపుతున్నానని జిల్లా నుండి బదిలీ అయిన కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం కొత్త కలెక్టర్‌కు చార్జి అప్పగించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా తాను నిర్వహించిన విధులకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరు తమ వంతుగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం వల్లనే తాను అనుకున్న పనులు పూర్తి ...

Read More »

గైర్హాజరైతే చర్యలుంటాయి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముందు అనుమతి లేకుండా గైర్జాజరైతే చర్యలు తప్పవని కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లోని అన్ని విభాగాలను, కార్యాలయాలను పరిశీలించారు. కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలు, ప్రగతి భవన్‌ లోని సంక్షేమ కార్యాలయాలు, డిఆర్‌డిఓ, తదితర కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వెంట ఉన్న డిఆర్‌ఓకు, ఏవోకు పలు సూచనలు జారీ చేశారు. కలెక్టరేట్‌ పరిసరాలు పరిశుభ్రంగా ...

Read More »

ఎన్నికలు, పల్లె ప్రగతి, ప్రజా సేవలు ప్రస్తుత అంశాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికలు, పల్లె ప్రగతితో పాటు ప్రజలకు అందించే సేవలు ప్రస్తుతం ప్రాధాన్యత అంశాలని కొత్తగా విధులు చేపట్టిన జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్‌గా మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రకటన వెలువడినందున ముందుగా వాటిపై దష్టి కేంద్రీకరించాల్సిన అవసరముందని, జిల్లాలోని ఒక కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ...

Read More »

28న తెలంగాణ ఉమెన్స్‌ ప్రీమియర్‌ ఫుట్‌ బాల్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 28న ప్రారంభం కానున్న మొదటి తెలంగాణ ఉమెన్స్‌ ప్రీమియర్‌ ఫుట్‌ బాల్‌ లీగ్‌ టోర్నమెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లను కార్యనిర్వాహక బందం మంగళవారం పరిశీలించింది. రాజారాం స్టేడియంలో టోర్నమెంట్‌ కొరకు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించినట్లు కార్యనిర్వాహక కార్యదర్శి నరాల సుధాకర్‌ తెలిపారు. పెవిలియన్‌కు రంగులు వేయడం, గోల్‌ పోస్టులకు రంగులు వేయడం, మైదానాన్ని చదును చేయడం తదితర పనులు కొనసాగుతున్నాయన్నారు. ఏర్పాట్లన్నీ కోచ్‌ గొట్టిపాటి నాగరాజు పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నారు. 27వ ...

Read More »

బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా సి. నారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ములుగు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం నిజామాబాద్‌ జిల్లాకు బదిలీ చేసినందున మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకొని కలెక్టర్‌ చాంబర్‌లో ఇక్కడి నుండి బదిలీ అయిన జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి వసతి గహానికి చేరుకున్న ఆయనకు సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, డిపిఆర్‌ఓ ...

Read More »

26న సూర్యగ్రహణం

బాసర, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా 25వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో అమ్మవారి ఆలయ ద్వారాలు మూసి ఉంచబడతాయని కార్యనిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి 26న ఉదయం 11.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, అమ్మవార్లకు అభిషేకం, హారతి, తీర్థప్రసాద వితరణ, సర్వదర్శనము, ఆర్జిత సేవలు, అక్షరాభ్యాసములు యధావిధిగా ...

Read More »

జనవరి 1 నుంచి ఆపరేషన్‌ స్మైల్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఆపరేషన్‌ స్మైల్‌ 6 పైన జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య ఆధ్వర్యంలో ప్రజావాణిలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ జనవరి 1 నుండి 31 తేదీ వరకు ఆపరేషన్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్‌ శాఖ నుండి ఎస్‌ఐపి, కార్మిక శాఖ నుండి అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి ఐసిపిఎస్‌ సిబ్బందిని కలిపి మూడు డివిజన్లలో రెస్క్యూ ...

Read More »