నిజామాబాద్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని అధికారులతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఫిర్యాదులకు కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరాలు అందించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ప్రజలు అవసరమైతే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసి వివరాలు అందించాలని దీనిని కలెక్టరేట్ ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు.
Read More »Daily Archives: December 27, 2019
ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రత్యేక దష్టి
నిజామాబాద్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంసిసి పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ఎక్కడ కూడా కోడ్ ఉల్లంఘన జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఎంసిసి టీమ్‌లు, ప్లయింగ్ స్క్వాడ్స్ వారి పనులను పకడ్బందీగా నిర్వహించేలా చూడాలని వారి వాహనాలపై టీమ్‌ల పేర్లను ప్రదర్శించాలని, ఎక్కడ ...
Read More »తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమే
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమేనని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన నిరుద్యోగులు, విద్యార్థులను, తెలంగాణ ప్రజలను కెసిఆర్ మోసం చేశాడని ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినా నిరుద్యోగులకు ఇస్తానన్న ...
Read More »ఈ నెల 30న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురించాలి
నిజామాబాద్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈనెల 30న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ప్రతి ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కలెక్టర్లను మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులకు ఆస్కారం లేకుండా ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం, బ్యాలెట్ పత్రాల ముద్రణ, బ్యాలెట్ బాక్సులు పనితీరును ...
Read More »కలెక్టర్‌ను కలిసిన రెంజల్ మండల సర్పంచులు
రెంజల్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డిని శుక్రవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు వికార పాషా ఆధ్వర్యంలో రెంజల్ మండల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు రమేష్, రాజు, ఖలిమ్ బేగ్, గణేష్, సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More »హరితహారం మొక్కలను సంరక్షించాలి
రెంజల్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కళ్యాపూర్, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాలలో శుక్రవారం వాటరింగ్ డే కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో గోపాలక ష్ణ, ఎంపీఓ గౌస్, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌లు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, ఎండిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను సంరక్షించాలని పేర్కొన్నారు. అనంతరం దూపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ...
Read More »పల్లె ప్రగతిపై అవగాహన సదస్సు
రెంజల్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు లోలపు రజినీ అధ్యక్షతన శనివారం పల్లెప్రగతిపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారులు ఉదయం 11 గంటలకు తప్పకుండా హాజరుకావాలని సూచించారు.
Read More »విరాళాలు అందించే దాతల పేర్లు, ఫోటోలు గ్రామాల్లో ప్రదర్శించాలి
నిజామాబాద్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో దాతలను ప్రోత్సహించి గ్రామాల అభివద్ధికి కషిచేయాలని, ఇందుకై విరాళాలు అందించే దాతల పేర్లు, ఫోటోలను గ్రామాలలో ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో పల్లె ప్రగతిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండలంలో అన్ని గ్రామాల కంటే ముందుగా పల్లె ప్రగతి పనులన్నీ ముందుగా పూర్తిచేసే గ్రామానికి ఎర్లీ బర్డ్ కింద మూడు ...
Read More »పల్లె ప్రగతిపై ప్రజల్లో చైతన్యం తేవాలి
మంత్రి దయాకర్ రావు నిజామాబాద్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతిపై ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా పల్లెలు అందంగా రూపుదిద్దు కుంటాయని రాష్ట్ర గ్రామీణ అభివద్ధి, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో కలిసి ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మొదటి విడతలో నిర్వహించిన నెల రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం మంచి ప్రశంసలు పొందిందని, అదేవిధంగా రెండవ ...
Read More »