Breaking News

Daily Archives: December 28, 2019

పల్లె ప్రగతికి ఊరంతా కదలాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి-2 పై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడివోలు, తహసీల్దార్లు, ఎంపీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులందరికీ ఆహ్వానాలు ఎంపీడీవోల ద్వారా పంపించాలని, జనవరి 2వ తేదీన గ్రామసభ నిర్వహించి పల్లె ప్రగతి మొదటి విడతలో నిర్వహించిన పనులకు ...

Read More »

సదరం క్యాంపు రెండు సోమవారాలు ఉండదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదరం స్లాట్‌ బుకింగ్‌ విధానం కొరకు సదరం వెబ్‌సైట్‌లో మార్పులు చేస్తున్నందున ప్రతి సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే సదరం క్యాంపులను డిసెంబరు 30, జనవరి 6వ తేదీలలో నిర్వహించడం లేదని జిల్లా గ్రామీణాభివృద్ది అదికారి ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు, క్యాంపునకు వచ్చే వారు గమనించాలన్నారు. తిరిగి సదరం స్లాట్‌ బుకింగ్‌ వివరాలను ప్రకటిస్తామన్నారు.

Read More »

సోమవారం కల్లా ధాన్యం కొనుగోలు ఓపి ఎంఎస్‌ వివరాలు నమోదు జరగాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంకా మిగిలి ఉన్న 20 శాతం ధాన్యం కొనుగోలు వివరాలను మూడు రోజుల్లో ఓపిఎంఎస్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్‌ నుండి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4.57 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకుగాను ఇంకా 72 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించి వివరాలు ఓపిఎమ్‌ఎస్‌లో నమోదు ...

Read More »

నవీపేటలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శనివారం ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల, తహసిల్దార్‌ కార్యాలయాల్లో ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు. ముందుగా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ఆయన అక్కడ ఇద్దరు డాక్టర్లు కూడా లేకపోవడం, ఆ సమయంలో విధుల్లో ఉండవలసిన డాక్టర్‌ తరుణం రాజ్‌ గైర్హాజరు కావడం, హెడ్‌ నర్స్‌ ఝాన్సీ, వాణి కలెక్టర్‌ తనిఖీ చేస్తున్న సమయంలో ఆలస్యంగా రావడం, రజనీ దేవి, నారాయణ, మంజుల, సరళ లేకపోవడం కుమారి సెలవు ...

Read More »

అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ మహిళా ప్రీమియర్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ లోని కలెక్టరేట్‌ మైదానంలో మొదటి తెలంగాణ మహిళా ప్రీమియర్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ పోటీలను జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ ఆటలను నిజామాబాద్‌లో నిర్వహించడానికి అవకాశమిచ్చిన రాష్ట్ర ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన పోటీలను నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ, నిజామాబాద్‌ అసోసియేషన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంత పెద్ద కార్యక్రమం మాటలతో కాదని ఎంతో పెద్ద వ్యయ ...

Read More »

పల్లెప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

రెంజల్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం గ్రామాల అభివద్ధి కొరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎంపీపీ లోలపు రజిని అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ రజిని అధ్యక్షతన పల్లె ప్రగతి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గోపాలకష్ణ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు సర్పంచులు, అధికారులు కషి చేస్తేనే పల్లెప్రగతి సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో స్మశానవాటికలు, ...

Read More »