Breaking News

Daily Archives: December 29, 2019

ఆదర్శ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదర్శ మున్నూరుకాపు సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం నగరంలోని వర్నిరోడ్డు, రేణుకానగర్‌ సంఘ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా పి.లక్ష్మినారాయణ, తోట రాజశేఖర్‌లు వ్యవహరించారు. నూతన కార్యవర్గం పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుందన్నారు. అధ్యక్షులుగా కొర్వ నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా ఖానాపూర్‌ గంగాధర్‌, కోశాధికారిగా మల్లేశ్వర్‌, ఉపాధ్యక్షులుగా బొల్లం కిషన్‌, మూర్తి పండరి, ఆలూర్‌ రాజేశ్వర్‌, సంయుక్త కార్యదర్శులు మేల్పుల సంజీవ్‌, జి.ప్రదీప్‌కుమార్‌, ...

Read More »

కల్కినగర్‌లో బిజెపి పురపాలక ఎన్నికల ప్రచారం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కల్కినగర్‌ 9 వ వార్డులో బీజేపీ కార్యకర్తలు పురపాలక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అవసరమైన అనుమతుల కోసం మున్సిపాలిటీ చుట్టూ ప్రజలు తిరగాల్సి వస్తుందని, ఇది ప్రధాన సమస్యగా ఉందన్నారు. సమస్యను దష్టిలో పెట్టుకొని కల్కినగర్‌లో వినియోగదారుల సేవ కేంద్రాలు ప్రారంభించాలని, వాటి ద్వారా అవసరమైన రుసుముకు మించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ...

Read More »

గ్రామ గ్రామాన పసుపు బోర్డు సాధన పాదయాత్ర

ఆర్మూర్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో రైతుల సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పసుపుబోర్డు సాధన పాదయాత్ర ఆదివారం మండలంలోని వన్నెల్‌ కే, గంగవరం, మారంపల్లి తదితర గ్రామాల్లో జరిగింది. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు బోర్డు కావాలని నినాదాలు చేశారు. కమిటీ కన్వీనర్‌ లింగారెడ్డి యాద గౌడ్‌, నర్సారెడ్డి, జావిద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఎన్‌ఆర్‌సి, సిఏబికి వ్యతిరేకంగా జేఏసి కమిటీ

నందిపేట్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలకేంద్రంలో ఎన్‌ఆర్‌సి, సిఏబికి వ్యతిరేకంగా జేఏసి కమిటీ ఏర్పాటైంది. నందిపేట మండలకేంద్రంలోని మార్కస్‌లో అల్‌ పార్టీ ఆధ్వర్యంలో జేఏసి కమిటీని ఏర్పాటుచేశారు. ఇందులో న్యూడెమొక్రటిక్‌ జిల్లా అధ్యక్షుడు కె.గంగాధర్‌ మాట్లాడుతూ బి.జె.పీ. ప్రవేశపెట్టిన ఎన్‌ఆర్‌సి, సిఏబి, బిల్లు మనదేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, ముస్లింలకు హక్కులను భంగపరిచే విదంగా ఉన్నాయని అన్నారు. తక్షణమే బి.జె.పి బిల్లును వెనక్కి తీసుకోవాలని లేకుంటే తాము ఎన్‌ఆర్‌సి, సిఏబికి విరుద్దంగా పోరాడుతామని, మున్ముందు దీనికి విరుద్ధంగా ...

Read More »

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండలం కోయ గడ్డ తండా ఒంటరి పల్లి తండాలకు చెందిన గిరిజనులు ఆదివారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల సురేందర్‌ చిత్రపటానికి, మండల కన్వీనర్‌ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్‌ లలితా రాందాస్‌ సమక్షంలో పాలాభిషేకం చేశారు. నూతనంగా ఏర్పడిన కొయ్య గుండు తండా గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే సహకారంతో 30 రోజుల ప్రణాళికలో 90 శాతం పనులు, హరితహారం మొక్కలు గిరిజన తండాను ముందుకు నడిపించినందుకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే సహకారంతో ...

Read More »

అన్ని వార్డులకు బిఎల్‌ఎఫ్‌ పోటీచేస్తుంది

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ జిల్లా ముఖ్యుల సమావేశం స్థానిక ఎంసిపిఐయు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దండి వెంకట్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శనివారం అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించి బీఎస్పీ నాయకున్ని బయటకు పంపడం హేయమైన చర్య అన్నారు. కామారెడ్డి జిల్లాలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఎంసిపిఐయు, వామపక్షాలు కలిసి అన్ని వార్డులకు పోటీలో ఉండాలని రాష్ట్ర కమిటీ ...

Read More »

మండల ముస్లిం కమిటీ ఏర్పాటు

నందిపేట్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు సమావేశమై మండల కమిటీని ఏర్పాటు చేశారు. మండల కమిటీ అధ్యక్షుడిగా ఆటో కలీం – నందిపేట్‌, ఉపాధ్యక్షునిగా మహమ్మద్‌ మౌజాన్‌ – తల్వేద, కార్యదర్శి మహమ్మద్‌ అక్బర్‌ – డొంకేశ్వర్‌, కోశాధికారి మొహమ్మద్‌ రఫీ, సహాయ కార్యదర్శిగా ఆబెద్‌ – బాద్గుణ, సలహాదారులుగా సయ్యద్‌ హుస్సేన్‌, డాక్టర్‌ అహ్మద్‌ ఖాన్‌, మాజీ ఎంపిటిసి, వివిధ గ్రామాల ముస్లిం ప్రముఖులు తదితరులు ...

Read More »

ఆకస్మిక తనిఖీలతో అధికారుల్లో దడ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్తగా నిజామాబాద్‌ జిల్లాకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీలతో అధికారుల్లో దడ పుట్టిస్తున్నారు. ఆదివారం స్థానిక న్యాల్‌కల్‌ రోడ్డులోని సమీకత షెడ్యూల్డ్‌ కులాల వసతి గహాన్ని ఉదయమే ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గహంలో విద్యార్థుల గదులను, స్నానపు గదులు, టాయిలెట్లను పరిశీలించారు. వసతి గహంలో వారికి కల్పించిన సదుపాయాలతో పాటు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ...

Read More »