Breaking News

Daily Archives: December 30, 2019

ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపాలిటీల పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించినందున ఈ విషయమై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలు తెలియజేయాలని కలెక్టర్‌ జిల్లా అధికారులతో కన్వర్జెన్స్‌ మీటింగ్‌ సందర్భంగా కోరారు. అదేవిధంగా మునిసిపాలిటీల పరిధిలో రిటర్నింగ్‌ అధికారులుగా, సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా విధులు నిర్వహించే ...

Read More »

ప్రతి కార్యాలయంలో బయోమెట్రిక్‌ హాజరు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తరచుగా సమావేశాలు నిర్వహించడం ద్వారా అధికారుల సమయాన్ని వధా చేయకుండా ప్రతి సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో కన్వర్జెన్స్‌ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో జిల్లా అధికారులతో కన్వర్జెన్స్‌ సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలని, టాయిలెట్స్‌ పనిచేయాలని అందులో వాతావరణం బాగుండాలని, ...

Read More »

కూనేపల్లి పాఠశాల తనిఖీ చేసిన ఎంపీపీ

రెంజల్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి పాఠశాలను సోమవారం ఎంపీపీ లోలపు రజినీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి ప్రభుత్వ బడిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాద్యాయులు కషి చేయాలని అన్నారు. ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి విద్యార్థులతో చర్చించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే తమ దష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విజయ, ప్రధానోపాధ్యాయురాలు ...

Read More »

పిఆర్‌టియు క్యాలెండర్‌ ఆవిష్కరణ

రెంజల్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని విద్యా వనరుల శాఖ కార్యాలయంలో సోమవారం పిఆర్‌టియు నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎంఈఓ గణేష్‌ రావు, పిఆర్‌టియు అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం, సాయరెడ్డిల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఉపాధ్యాయుల సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేయడంలో పిఆర్‌టియు ఎప్పుడు ముందుంటుందని, ఉపాధ్యాయుల పక్షాన అనునిత్యం వారి గొంతుకై పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో పిఆర్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్‌ సింగ్‌, రాష్ట్ర కార్యదర్శులు తాహేర్‌, రహమాన్‌, ...

Read More »

సూర్యోదయ స్కూల్‌లో ఫుడ్‌ ఫెస్టివల్‌

నందిపేట్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని సూర్యోదయ హై స్కూల్‌లో సోమవారం ఫుడ్‌ ఫెస్టివల్‌ అత్యంత వైభవంగా జరిగింది. విద్యార్థులు తమ ఇంటి వద్ద వంట చేసి తీసుక వచ్చిన వాటిని స్టాల్‌ రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ శ్రీనివాస్‌, పాఠశాల కరెస్పాండెంట్‌ నాగరావు , ప్రధానోపాధ్యాయులు సురేష్‌ గారు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

రక్తదానం చేయండి – ప్రాణదాతలుగా నిలవండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్తదానం ద్వారా పోయే ప్రాణాలను కాపాడే వారి కంటే గొప్ప వారు ఎవరూ ఉండరని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం రెడ్‌ క్రాస్‌ సొసైటీ కార్యాలయంలో ఇందూరు యువత అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంబించి మాట్లాడారు. ఎన్ని లక్షలు, కోట్ల రూపాయలు ఇచ్చినా పోయిన ప్రాణాలను రక్షించ లేమని, కేవలం రక్తదానం ద్వారానే ప్రాణాలను రక్షించ గలుగుతామన్నారు. మన కళ్ళ ముందే రక్తం లేక ప్రమాదాల వలన ...

Read More »

హమాలీ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటు చేసినట్లు హమాలీ కార్మికులందరికీ కూడా వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హమాలి కార్మికులకు పి.ఎఫ్‌., ఈ.ఎస్‌.ఐ., సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులను ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన హమాలి కార్మికులకు ఐదు వేల రూపాయల పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కొరకు జనవరి ...

Read More »

మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ

రెంజల్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఎంపీపీ రజిని, సర్పంచ్‌ రమేష్‌ భూమి పూజ చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల ద్వారా మంజూరైన రూ.1.90 వేలతో అభివద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు పనులలో నిర్లక్ష్యం వహించకుండా నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో గణేష్‌ రావ్‌, మాజీ ఎంపీటీసీ కిషోర్‌, నాయకులు మేక సంతోష్‌, భూమయ్య, ప్రకాష్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Read More »

జాతీయ పద్మశాలి యువజన సంఘ ఉపాధ్యక్షులుగా సిలివేరి గణేశ్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ పద్మశాలి యువజన సంఘ ఉపాద్యక్షులుగా నిజామాబాదు జిల్లాకు చెందిన సిలివేరి గణేశ్‌ నియమితులయ్యారు. నిజామాబాదు జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న గణేష్‌ను జాతీయ ఉపాద్యక్షులుగా నియమించారు. ఈ మేరకు జాతీయ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు ఏలె వెంకటనారాయణ గణేష్‌కు నియామక పత్రం అందజేశారు. గణేష్‌ నియామకం పట్ల నిజామాబాదు జిల్లా పద్మశాలి యువజన సంఘం ప్రధాన కార్యదర్శి చింతల గంగాదాస్‌, ప్రచార కార్యదర్శి అందె నరేందర్‌ తదితరులు ...

Read More »

ముసాయిదా ఓటర్ల జాబితా పూర్తి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ నెల 30న మున్సిపాలిటీల పరిధిలో డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌ ప్రచురించడం జరిగిందని, జాబితాలను సంబంధిత మున్సిపాలిటీలలో ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. ఓటర్లు జాబితాలను పరిశీలించుకుని ఏమైనా అభ్యంతరాలుంటే ఆయా మున్సిపాలిటీలలో దరఖాస్తు చేయాలని కలెక్టర్‌ ప్రకటనలో తెలియజేశారు.

Read More »

ఎలక్షన్‌ కోడ్‌ ఉల్లంఘించిన మునిసిపల్‌ కమీషనర్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా బోధన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఎమ్మెల్యే ఆదేశాలతో మున్సిపల్‌ ఆఫీసులోనే కౌంటర్‌ ఓపెన్‌ చేసి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కొరకు దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. కమీషనర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి, బోధన్‌ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు మోయినుద్దిన్‌ పాషా ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి పిర్యాదు చేశారు. కార్యక్రమంలో మహమ్మద్‌ గౌస్‌ ...

Read More »

విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే

బాన్సువాడ, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్‌లో ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ నూతన సంవత్సర క్యాలెండర్‌ను బాన్సువాడ ఎంపీపీ నీరజ వెంకట్రామ్‌ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే భాద్యత ఉపాద్యాయులపైన ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. పిల్లలకు ప్రాధమిక స్థాయి నుండే నైతిక విలువలు, క్రమశిక్షణ కలిగిన మంచి విద్యార్థులుగా తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రావణ్‌, ఎంపీటీసీ రమణ, పిఆర్‌టియు నాయకులు పాల్గొన్నారు.

Read More »

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు ఉపసంహరించుకోవాలి

నందిపేట్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం మండలకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జేఏసి కమీటీ ఆద్వర్యంలో స్థానిక తహశీల్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ రవీందర్‌ నాయక్‌, స్థానిక సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ రాఘవేందర్‌కి ఎన్‌ఆర్‌సి, సిఏబి బిల్లును తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసి కన్వీనర్‌ సయ్యద్‌ జమీల్‌ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సి, సిఏబి బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని, అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయని, ఇలా ఒక్కొక్క బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి పూర్తి ...

Read More »

ఆదర్శ గ్రామలే లక్ష్యంగా పనిచేయాలి

రెంజల్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ పల్లెలను ఆదర్శ గ్రామలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా రూపొందించిన 10 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని ఎంపీడీవో గోపాలకష్ణ సూచించారు. 10 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో పర్యటించారు. గ్రామాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. గ్రామాల్లో ప్రధానంగా పరిశుద్యంపై దష్టి సారించాలని, మురికి కాలువలు శుభ్రం చేయడం, చెత్తాచెదారం తొలగించడం మొక్కలు నాటడం ద్వారా గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తయారు చేసుకోవచ్చని ...

Read More »

జనవరి 8న భారత్‌ బంద్‌ విజయవంతం చేయండి

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యాలయం ఏఐకెఎస్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి అధ్యక్షతగా కామారెడ్డి జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జూకంటి సుధాకర్‌ అధ్యక్షత వహించారు. రౌండ్‌ టేబుల్‌ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ హాజరుహయ్యరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ పంటలన్నిటికీ ఉత్పత్తి ఖర్చులపై 50 శాతం అదనంగా గిట్టుబాటు ...

Read More »

బాన్సువాడ మునిసిపల్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి పాల్గొని రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం భారత దేశ ప్రజలపై లేనిపోని బిల్లులు తీసుకు వచ్చి దేశం మొత్తంలో కారు చిచ్చు రేపుతూ, ...

Read More »

అపూర్వం పూర్వవిద్యార్థుల సమ్మేళనం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుకున్న 1997-2000 బ్యాచ్‌ మెకానికల్‌ ఇంజినీర్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన విరామ ప్రిన్సిపాల్‌ నాగయ్య, వజ్రోత్సవాల కన్వీనర్‌ బాల నర్సింలు, వర్కుషాప్‌ ఇంచార్జి, పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కళాశాలలో చదువుకున్న రోజులను, చిన్ననాటి మధురజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుతం వారు చేస్తున్న వత్తులు, కుటుంబ నేపథ్యం వివరాలను పంచుకున్నారు. వారు చదివిన కళాశాలను తమ కుటుంబీకులకు చూపిస్తూ ఆనంద ...

Read More »

ప్రజావాణికి ప్రథమ ప్రాధాన్యత

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రజల సమస్యలు ఎంత త్వరగా పరిష్కరిస్తే పరిపాలన అంత బలంగా ఉంటుందని తెలిపారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా మన వద్ద పెండింగ్‌లో పెట్టుకోవద్దని ఆదేశించారు. ప్రజల నుండి స్వీకరించే ప్రతి దరఖాస్తును ...

Read More »