Breaking News

తెలుగు అధ్యయనశాఖ విభాగంలో మురళీకృష్ణకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖ పరిశోధక విద్యార్థి కంబాల మురళీకష్ణకు డాక్టరేట్‌ను విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖ మొదటి బ్యాచ్‌ పరిశోధకుడిగా చేరిన కంబాల మురళీకష్ణ ‘తెలుగు దినపత్రికలు-ఆధునిక ధోరణుల అనుశీలన 2000’ అనే అంశంపై సహాయక ఆచార్యులు డాక్టర్‌ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.

ఈ మేరకు డిసెంబర్‌ 2వ తేదీన పద్మావతి విశ్వవిద్యాలయం ఆచార్యులు కొలకలూరి మధు జ్యోతి ఆధ్వర్యంలో తెలుగు అధ్యయన శాఖలో ఓపెన్‌ వైవా నిర్వహించారు. అదే రోజు మురళీకష్ణకు డాక్టరేట్‌ ప్రకటించారు.

ఈ విషయమై మంగళవారం అధికారిక డాక్టరేట్‌ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదే విశ్వవిద్యాలయంలో పీజీ చదివిన మురళీకష్ణ ఇక్కడే పిహెచ్‌డి పూర్తి చేసి డాక్టరేట్‌ అవార్డు పొందడంపై విశ్వవిద్యాలయ కళల విభాగం అధిపతి ఆచార్య పి.కనకయ్య, తెలుగు అధ్యయన శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్‌ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి, డాక్టర్‌ వి. త్రివేణి, డాక్టర్‌ కే. లావణ్య, డాక్టర్‌ లక్ష్మణ చక్రవర్తి అభినందనలు తెలియజేశారు. మురళికష్ణకు డాక్టరేట్‌ ప్రధానం చేయడంపై సహ పరిశోధక మిత్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *